కర్ణాటకలో ఎనిమిది మంది మంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(సీసీబీ) పోలీసులను బదిలీ చేశారు స్థానిక పోలీస్ కమిషనర్ ఎన్ శశికుమార్. వారంతా.. ఓ కేసులోని నిందితులతో కలిసి మద్యం సేవించడం, భోజనం చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
మంగళూరు సీసీబీ పోలీసులు.. కుట్టార్లోని ఓ బార్లో నిందితులతో కలిసి మందు, విందు కార్యక్రమంలో పాల్గొన్నట్టు వార్తలొచ్చాయి. ఈ విషయం కమిషనర్ వరకు చేరింది. ఈ నేపథ్యంలో సంఘటనపై తక్షణమే దర్యాప్తు చేపట్టాలని డీసీపీ హరిరామ్‌ను ఆదేశించారు. ఈ క్రమంలో ముగ్గురు ఏఎస్ఐ, ఐదుగురు సిబ్బందిని సీసీబీ యూనిట్ నుంచి నగర కమిషనర్ కార్యాలయంలోని వివిధ పోలీస్ ఠాణాలకు బదిలీ చేశారు.
ఇదీ చదవండి: చేతులు లేకున్నా.. కాళ్లతో రాస్తూ ఇంటర్లో టాపర్