ETV Bharat / bharat

ఏడాది లేట్​గా గమ్యం చేరిన గూడ్స్ రైలు- అధికారులు షాక్! - ఏడాది ఆలస్యంగా ట్రైన్​

Train delayed by a year: రైళ్లు ఆలస్యం కావడం భారత్​లో సహజమే. కాకపోతే.. కొన్ని నిమిషాలో, గంటలో లేట్​ అవుతుంటాయి. కానీ.. ఏకంగా సంవత్సరం ఆలస్యమైతే? ఝార్ఖండ్​లో ఇదే జరిగింది. ఆహార ధాన్యాల లోడుతో ఏడాది క్రితం ఛత్తీస్​గఢ్ నుంచి రావాల్సిన రైలు.. ఈనెల 17న గమ్యస్థానం చేరింది.

Train delayed by a year
Train delayed by a year
author img

By

Published : May 27, 2022, 9:16 PM IST

Updated : May 27, 2022, 10:21 PM IST

Train delayed by a year: అధికారుల నిర్లక్ష్యం కారణంగా.. ఓ గూడ్స్​ రైలు ఏడాది ఆలస్యంగా గమ్యస్థానం చేరింది. ఫలితంగా పేదలకు అందాల్సిన ఆహార ధాన్యాలు పాడైపోయాయి. ఝార్ఖండ్​ గిరీడీలో జరిగిన ఈ ఘటన రైల్వే శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

Train delayed by a year
బియ్యం నిల్వలు
Train delayed by a year
పాడైపోయిన బియ్యం

762 కి.మీ.. ఏడాది ప్రయాణం: ఈనెల 17న ఝార్ఖండ్​లోని ఓ న్యూ గిరీడీ స్టేషన్​కు ఓ గూడ్స్ రైలు వచ్చింది. ఒక బోగీలోని సరకును అన్​లోడ్ చేసుకోవాల్సిందిగా స్టేషన్​ సిబ్బందికి సమాచారం అందింది. షెడ్యూల్​తో ఏమాత్రం సంబంధం లేకుండా వచ్చిన ఈ బోగీని చూసి వారు నివ్వెరపోయారు. ఫుడ్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియాకు సంబంధించిన బియ్యం లోడు ఆ బోగీలో ఉన్నట్లు తెలుసుకున్నారు. కాసేపటి తర్వాత న్యూ గిరీడీ స్టేషన్​ సిబ్బందికి అసలు విషయం అర్థమవగా.. వారంతా షాకయ్యారు.ఎందుకంటే.. ఆ రైలు బోగీ గతేడాదే రావాల్సి ఉంది.

Train delayed by a year
పరిశీలిస్తున్న అధికారులు

2021 మేలో ఛత్తీస్​గఢ్​లోని ఓ స్టేషన్​లో ఆ బోగీలో 1000 బియ్యం బస్తాలు వేశారు. కానీ.. సాంకేతిక కారణాలతో అప్పటి నుంచి ఆ వ్యాగన్ ముందుకు కదలలేదు. ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు ఉన్నట్టుండి 762 కిలోమీటర్ల దూరంలోని గమ్యస్థానాన్ని చేరింది. ఏడాది ఆలస్యం కారణంగా భారీ నష్టమే జరిగింది. ఆ బోగీలోని 200-300 బస్తాల బియ్యం పూర్తిగా పాడైపోయింది. మిగిలిన సరకు కూడా చాలా పాతదని, పనికొస్తుందో లేదో చెప్పలేమని స్టేషన్ సిబ్బంది అన్నారు. ఈనెల 31న ఉన్నతాధికారులు వచ్చి ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేస్తారని న్యూ గిరీడీ స్టేషన్​ మాస్టర్ పంకజ్ కుమార్ ఈటీవీ భారత్​కు చెప్పారు.

ఇదీ చదవండి: నదిలో ఖరీదైన 'బీఎండబ్ల్యూ' కారు.. కారణం తెలిసి పోలీసులు షాక్​

Last Updated : May 27, 2022, 10:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.