ETV Bharat / bharat

Train Accidents In India : పదేళ్లలో 6 ఘోర రైలు ప్రమాదాలు.. ఈ దశాబ్దంలోనే అతి పెద్దది ఇదే

Train Accidents In India : గత పది సంతవత్సరాలలో దేశంలో భారీ రైలు ప్రమాదాలు జరిగాయి. దీంట్లో ఒడిశా ప్రమాదం కూడా ఒకటిగా నిలిచింది. ఎప్పుడు ఏ రైలు ప్రమాదాలు గురయ్యాయో ఇప్పుడు తెలుసుకుందాం.

odisha Train accident
odisha Train accident
author img

By

Published : Jun 3, 2023, 6:49 AM IST

Updated : Jun 3, 2023, 6:05 PM IST

Train Accidents In India : శుక్రవారం రాత్రి ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం.. 278 మంది ప్రాణాలను బలితీసుకుంది. మరో 900 మందికి పైగా గాయడ్డారు. ఒకేసారి మూడు రైళ్లు ప్రమాదానికి గురైన ఈ ఘటనతో దేశమంతా దిగ్భ్రాంతికి గురైంది. గత పది పదేళ్లలో జరిగిన రైలు ప్రమాదాలలో ఇదే అతి పెద్దదిగా చెప్పవచ్చు. అయితే దశాబ్దకాలంలో జరిగిన.. వివిధ భారీ ప్రమాదాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Train Accidents In India
దశాబ్ద కాలంలో జరిగిన ఘోర రైలు ప్రమాదాలు

హుబ్లీ-బెంగళూరు హంపి ఎక్స్‌ప్రెస్..
2012 మే 22న ఓ కార్గో రైలు, హుబ్లీ-బెంగళూరు హంపి ఎక్స్‌ప్రెస్ ఆంధ్రప్రదేశ్‌ సమీపంలో ఢీకొని.. 4బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో రైలులో మంటలు చెలరేగి దాదాపు 25మంది మరణించారు. మరో 43మంది ప్రయాణికులు గాయపడ్డారు.

గోరఖ్‌ధామ్ ఎక్స్‌ప్రెస్..
2014 మే 26న ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్‌నగర్ ప్రాంతంలో, గోరఖ్‌పూర్ వైపు వెళుతున్న గోరఖ్‌ధామ్ ఎక్స్‌ప్రెస్ ఖలీలాబాద్ స్టేషన్‌కు సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో 25మంది మరణించగా.. 50మందికి పైగా గాయపడ్డారు.

ఇండోర్-పాట్నా ఎక్స్‌ప్రెస్ ..
2016 నవంబర్ 20న, ఇండోర్-పట్నా ఎక్స్‌ప్రెస్ కాన్పూర్‌లో పుఖ్రాయాన్‌కు సమీపంలో పట్టాలు తప్పింది. ఆ ప్రమాదంలో 150 మంది ప్రయాణికులు మరణించారు. 150మందికిపైగా గాయపడ్డారు.

కైఫియత్ ఎక్స్‌ప్రెస్..
2017 ఆగస్టు 23న, దిల్లీకి వెళ్లే కైఫియత్ ఎక్స్‌ప్రెస్ 9 కోచ్‌లు, ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యాలో పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 70 మంది గాయపడ్డారు.

పురి-హరిద్వార్ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్..
2017 ఆగస్ట్ 18న, పురి-హరిద్వార్ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ ముజఫర్‌నగర్‌లో పట్టాలు తప్పడం వల్ల 23 మంది మరణించారు. మరో 60 మంది గాయపడ్డారు.

బికనీర్-గౌహతి ఎక్స్‌ప్రెస్..
2022 జనవరి 13న, పశ్చిమ బెంగాల్ అలీపుర్‌దువార్‌లో బికనీర్-గౌహతి ఎక్స్‌ప్రెస్ 12 కోచ్‌లు పట్టాలు తప్పడంతో 9 మంది మరణించారు. మరో 36 మంది గాయపడ్డారు.

ప్రమాదం జరిగింది ఇలా..
Odisha Train Accident : తాజాగా ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో అనూహ్య రీతిలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 278 మంది మృతి చెందారు. 900 మందికి పైగా గాయాపడ్డారు. బెంగళూరు-హావ్‌డా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ బాలేశ్వర్‌ సమీపంలోని బహానగా బజార్‌ వద్ద శుక్రవారం రాత్రి దాదాపు ఏడు గంటల ప్రాంతంలో తొలుత పట్టాలు తప్పింది. ఫలితంగా దాని బోగీలు పక్కనే ఉన్న ట్రాక్‌పై పడ్డాయి. వాటిని షాలిమార్‌-చెన్నై సెంట్రల్‌ కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. దాంతో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన పదిహేను బోగీలు బోల్తాపడ్డాయి. అనంతరం బోల్తాపడ్డ కోరమండల్‌ కోచ్‌లను పక్కనున్న ట్రాక్‌పై దూసుకొచ్చిన గూడ్సు రైలు ఢీకొంది. మూడు రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోవడం వల్ల ప్రమాదం తీవ్రత పెరిగింది. ఘటన జరిగిన గురైన సమయంలో కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ కోల్‌కతా నుంచి చెన్నైకి వెళ్తోంది. ప్రస్తుతం క్షతగాత్రులందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఘటన పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Last Updated : Jun 3, 2023, 6:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.