ETV Bharat / bharat

దుర్గమ్మ విగ్రహ నిమజ్జనంలో విషాదం- 8 మంది మృతి - దుర్గమ్మ నిమజ్జనంలో మృతి

Durga idol immersion tragedy
దుర్గమ్మ విగ్రహ నిమజ్జనంలో విషాదం
author img

By

Published : Oct 6, 2022, 6:33 AM IST

Updated : Oct 6, 2022, 7:59 AM IST

06:24 October 06

దుర్గమ్మ విగ్రహ నిమజ్జనంలో విషాదం

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు రోజున బంగాల్​లోని జల్పాయ్​గుడిలో పెను విషాదం నెలకొంది. దుర్గమ్మ విగ్రహ నిమజ్జనం కోసం నదిలోకి దిగిన 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గల్లంతయ్యారు. ఈ ఘటన మాల్​బజార్​ ప్రాంతంలో బుధవారం సాయంత్రం జరిగింది.

ఇప్పటివరకు భక్తిశ్రద్ధలతో పూజించిన దుర్గామాత విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు వందలాది మంది స్థానికులు అనేక మందికి మాల్​ నదికి వెళ్లారు. నది మధ్యలో ఉన్న ఓ చిన్న దీవి లాంటి ప్రదేశంలో నిల్చుని.. విగ్రహాలు నిమజ్జనం చేస్తున్నారు. ఇంతలోనే ఎగువ నుంచి ఒక్కసారిగా వరద పోటెత్తింది. దీవిని ముంచెత్తింది. అనేక మంది నీటిలో కొట్టుకుపోయారు. సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. పోలీసులు, ఎన్​డీఆర్​ఎఫ్​ సిబ్బందిని రంగంలోకి దింపారు. వరద ఉద్ధృతి మధ్య దీవిపై అలానే బిక్కుబిక్కుమంటూ నిల్చున్న దాదాపు 40 మందిని రక్షించారు. నదిలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Last Updated : Oct 6, 2022, 7:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.