Traffic Police saves patient life: కర్ణాటక, బెంగళూరులో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ మానవత్వాన్ని చాటారు. అంబులెన్సు టైరు మార్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తి సరైన సమయానికి ఆస్పత్రికి వెళ్లేందుకు సాయపడ్డారు.
ఏమైందంటే..?
కబ్బన్ పార్క్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో పనిచేసే కసప్ప కల్లూర్.. సీఐడీ కార్యాలయం వద్ద విధులు నిర్వహిస్తుండగా అటుగా వెళ్తున్న అంబులెన్సు టైర్ పంక్చర్ అయింది. అంబులెన్సులో ఓ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ క్రమంలో అంబులెన్సు డ్రైవర్ టైరు మార్చే పనిలో పడ్డాడు. ఇది గమనించిన కసప్ప.. వెంటనే అక్కడకు వచ్చి స్పానర్ పట్టుకుని టైరు మార్చి డ్రైవర్‌కు సాయపడ్డారు. దీంతో అంబులెన్సు అక్కడి నుంచి బయల్దేరింది.
ఆ తర్వాత రోగి కుటుంబ సభ్యులు ట్రాఫిక్ పోలీస్ కసప్పకు కృతజ్ఞతలు చెప్పారు.
రూ. 5వేలు బహుమానం..
సమయస్ఫూర్తితో వ్యవహరించి ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడిన ట్రాఫిక్ పోలీస్ కసప్పను ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ డాక్టర్. బీఆర్ రవికాంత్ గౌడ ప్రశంసించారు. రూ.5వేల నగదు బహుమానం అందించారు.
ఇదీ చూడండి: బతికున్న బల్లిని కసకసా నమిలి మింగేసి..