ETV Bharat / bharat

వైరల్​: ఇద్దరు పోలీసుల మధ్య 'హెల్మెట్​' చిచ్చు​ - ఇద్దరు ఖాకీల మధ్య వివాదం

ఇద్దరు పోలీసు అధికారులు.. నడిరోడ్డుపై వాగ్వాదానికి దిగారు. హెల్మెట్​ ధరించలేదనే ఆగ్రహంతో ఓ ట్రాఫిక్​ అధికారి.. పోలీస్​ సిబ్బందిపై చెయిచేసుకున్నారు. ఝార్ఖండ్​లో జరిగిన ఈ ఘటన.. సోషల్​ మీడియాలో తెగ వైరల్​ అయింది.

Fight between the two policemen
పోలీస్​పై చేయిచేసుకున్న ట్రాఫిక్​ సిబ్బంది​
author img

By

Published : Apr 15, 2021, 10:30 AM IST

పోలీస్​పై చేయిచేసుకున్న ట్రాఫిక్​ సిబ్బంది​

ఝార్ఖండ్​లో ఓ పోలీసు​పై, ట్రాఫిక్​ అధికారి దురుసుగా ప్రవర్తించారు. హెల్మెట్​ ధరించలేదనే కారణంగా ఆయనతో వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరిగి దాడి చేసుకునే వరకు వెళ్లింది. ట్రాఫిక్​ సిబ్బంది ఆగ్రహంతో ఊగిపోయి.. పోలీసుపై చెయిచేసుకున్నారు. ఈ సంఘటనకు బంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

అసలేం జరిగిందంటే.?

రాంచీలోని సహజానంద్​ చౌక్​ సమీపంలో ఓ పోలీస్ శిరస్త్రాణం ధరించకుండా బైక్​పై వెళ్తున్నారు. ఇది గమనించిన అక్కడి ట్రాఫిక్​ పోలీస్​.. ఆయన వాహనాన్ని ఆపి జరిమానా విధించారు. దానికి పోలీస్ అధికారి​ నిరాకరించారు. అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు యత్నించారు. ఇంతలో ట్రాఫిక్​ పోలీసు ఆయన్ను వెంబడించి నడిరోడ్డుపైనే దాడి చేశారు.

ఈ దృశ్యాలు వైరల్​ అవడం వల్ల.. విషయం ఉన్నతాధికారులకు చేరింది. దీనిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని రాంచీ సిటీ ఎస్పీ సౌరభ్​ తెలిపారు. ఈ విషయమై దర్యాప్తు చేపట్టామన్న ఆయన.. దోషులెవరో తేల్చి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఇదీ చూడండి: దాల్​ సరస్సులో 'పడవ ర్యాలీ'కి విశేష స్పందన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.