ETV Bharat / bharat

నేడు కార్మిక సంఘాల దేశ వ్యాప్త సమ్మె - ఏఐబీఓఏ

కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నాయి కార్మిక సంఘాలు. ఈ బంద్​లో భాగంగా రెండు రోజుల పాటు 'ఛలో పార్లమెంట్' మార్చ్​ను నిర్వహించనున్నాయి. దీని వల్ల బ్యాంక్​ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడనుంది

Trade unions to go on nationwide strike on Thursday
కార్మిక సంఘాల దేశ వ్యాప్త సమ్మె నేడే
author img

By

Published : Nov 26, 2020, 5:03 AM IST

కేంద్రం అనుసరిస్తోన్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా పది కేంద్ర కార్మిక సంఘాలు నేడు దేశవ్యాప్త సమ్మె నిర్వహించనున్నాయి. ఈ బంద్​లో భాగంగా 26, 27 తేదీల్లో 'ఛలో పార్లమెంట్' మార్చ్​ను నిర్వహించున్నారు కార్మికులు. నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ బంద్​లో పాల్గొనాలని పిలుపునిచ్చాయి కార్మిక సంఘాలు. ఇందులో.. ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, టీయూసీసీ, హెచ్​ఎంఎస్​, ఏఐయూటీయూసీ, ఎస్​ఈడబ్ల్యూఏ, ఏఐసీసీటీయూ, ఎల్​పీఎఫ్​, యూటీయూసీలు పాల్గొంటున్నాయి. అయితే భాజపా కూటమికి చెందిన భారతీయ మజ్దూర్​ సంఘ్​(బీఎంఎస్​) ఈ సమ్మెలో పాల్గొనేందుకు విముఖత చూపింది.

ప్రధాన డిమాండ్లు?

  • పన్ను పరిధిలో లేని ప్రతి కుటుంబానికి నెలకు రూ.7,500 నగదు అందించాలి.
  • పేద కుటుంబంలోని ప్రతి వ్యక్తికీ నెలకు 10 కిలోల రేషన్​ బియ్యం ఉచితంగా ఇవ్వాలి.
  • ఉపాధి హామీ పథకాన్ని సంవత్సరంలో 200 రోజులకు పొడిగించాలి.
  • కేంద్రం అనుసరిస్తోన్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలి.
  • నూతన పెన్షన్​ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేసి.. అందరికీ పెన్షన్​ వచ్చేలా చేయాలి.

బ్యాంకు సేవలపై​ ప్రభావం..

దేశవ్యాప్తంగా నిర్వహిస్తోన్న సమ్మె కారణంగా బ్యాంకు​ కార్యకలపాలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. కొన్ని బ్యాంకు ఉద్యోగుల సంఘాలు కూడా ఈ బంద్​లో పాల్గొనేందుకు సిద్ధమైన నేపథ్యంలో రెండు రోజుల పాటు పలు బ్యాంకుల సేవలకు అంతరాయం ఏర్పడనుంది.

బ్యాంకులకు సంబంధించిన ఏఐబీఈఏ, ఏఐబీఓఏ, బీఈఎఫ్ఐ సంఘాలు ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కొందరు​ ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు.

ఇదీ చదవండి:సార్వత్రిక సమ్మెలో 25 కోట్ల మంది కార్మికులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.