ETV Bharat / bharat

ప్రారంభం రోజే పట్టాలు తప్పిన రైలు.. మంత్రికి తప్పిన ప్రమాదం!

Toy Train Derailed: కర్ణాటకలోని హుబ్బళ్లిలో చిల్డ్రన్​ ట్రైన్​ ప్రమాదానికి గురైంది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్​ జోషి రైలును ప్రారంభించిన కొద్ది సేపటికే ఈ ఘటన జరిగింది. హుబ్బళ్లి-ధార్వాద్​ స్మార్ట్​సిటీ ప్రాజెక్టులో భాగంగా రూ.4.2 కోట్ల వ్యయంతో ఇందిరా గాంధీ గ్లాస్​ హౌస్​ గార్డెన్​లో ఈ చిల్డ్రన్​ ట్రైన్​ను ఏర్పాటు చేశారు.

karnataka
karnataka
author img

By

Published : Apr 30, 2022, 8:07 PM IST

పట్టాలు తప్పిన రైలు

Toy Train Derailed: సేవలు ప్రారంభించిన కొద్ది సేపటికే ఓ చిల్డ్రన్​ ట్రైన్​ పట్టాలు తప్పింది. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఘటన జరిగిన సమయంలో రైలులో కేంద్ర మంత్రి ప్రహ్లాద్​ జోషి సహా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్​ శెట్టర్​ ఉన్నారు. కర్ణాటక హుబ్బళ్లిలోని ఇందిరా గాంధీ గ్లాస్​ హౌస్​ గార్డెన్స్​లో శనివారం.. పిల్లల రైలు ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఘటన జరిగింది. రైలు పట్టాలు తప్పడంపై మంత్రి ప్రహ్లాద్​ జోషి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

హుబ్బళ్లి-ధార్వాద్​ స్మార్ట్​సిటీ ప్రాజెక్టులో భాగంగా రూ.4.2 కోట్ల వ్యయంతో ఇందిరా గాంధీ గ్లాస్​ హౌస్​ గార్డెన్​లో ఈ చిల్డ్రన్​ ట్రైన్​ను ఏర్పాటు చేశారు. శనివారం ఈ రైలు సేవలను ప్రహ్లాద్​ జోషి ప్రారంభించారు. అనంతరం ఆయన కూడా రైలులో ప్రయాణించారు. కానీ రైలు కొంత దూరం వెళ్లాక పట్టాలు తప్పడం వల్ల ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.

ఇదీ చూడండి : అత్యాచారం విఫలయత్నం.. రైలు నుంచి యువతిని తోసేసి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.