హిమాచల్ ప్రదేశ్ లాహౌల్-స్పితి జిల్లాను మంచు దుప్పటి కప్పేసింది. ఎటు చూసినా శ్వేత వర్ణంతో స్వర్గధామంలా కనువిందు చేస్తోంది.
రషెల్ గ్రామంలోని ఇళ్లపై మంచు ఆవరించింది. గురువారం ఉదయం నుంచి ఈ ప్రాంతంలో విపరీతమైన మంచు కురుస్తోంది.

కుల్లు జిల్లాలోని జాలోరి కనుమలో మంచు అధికంగా కురుస్తోంది.

సిమ్లాలోని కుఫ్రీ ప్రాంతంలో హిమపాతం భారీగా కురుస్తోంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడం వల్ల చలి పెరిగింది. గుజరాత్ నుంచి వచ్చిన కొందరు పర్యటకులు.. మొదటిసారిగా ఈ హిమపాత దృశ్యాలను చూసి ఆనందానికి లోనవుతున్నారు.


మంచు వల్ల పలు చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు సహాయ చర్యల్ని చేపడుతున్నారు.
ఇదీ చూడండి:పిల్లలతో పులి కేరింతలు- పర్యటకులు ఫిదా