రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆదివారం ఉత్తరాఖండ్ రుషికేశ్‌లోని పరమార్థ నికేతన్(Ram nath kovind uttarakhand visit) వద్ద 'గంగా హారతి' కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే.. ఈ కార్యక్రమంలో భద్రతా విధులు నిర్వర్తించేందుకు వచ్చినవారిలో 19 మంది అధికారులు, సిబ్బందికి కరోనా నిర్ధరణ కావడం కలకలం సృష్టించింది. ముందుజాగ్రత్త చర్యగా.. అందరూ అధికారులను ప్రస్తుతం తమ సొంత జిల్లాల్లో ఐసొలేషన్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు.
14 మంది పోలీసులు...
19 మంది బాధితుల్లో 14 మంది పోలీసు సిబ్బంది కాగా.. మిగతా ఐదుగురు వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు, అధికారులు అని పౌడీ ఎస్ఎస్పీ పి.రేణుకా దేవీ 'ఈటీవీ భారత్'కు తెలిపారు. విధుల్లో పాల్గొనడం కంటే ముందే వారిని ముందుజాగ్రత్త చర్యగా క్వారంటైన్లో ఉంచినట్లు చెప్పారు. ఈ వైరస్ బాధితులతో సన్నిహతంగా ఉన్న మిగతా అధికారుల వివరాలను సేకరించామని చెప్పారు. వారిని ఐసోలేషన్ ఉండాలని ఆదేశించినట్లు చెప్పారు.
చమోలీ, ఉత్తరకాశీ, రుద్రప్రయోగ్, దెహ్రాదూన్, తెహ్రీ, పౌడీ నుంచి 400 మంది పోలీసులు, వివిధ శాఖల సిబ్బందికి శనివారం పరమార్థ నికేతన్ ఆశ్రమం వద్ద పరీక్షలు నిర్వహించారు. ఆదివారం ఉదయం వారిలో కొంతమందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. వీరందరినీ భద్రతా విధుల నుంచి తాత్తాకలికంగా తప్పించినట్లు అధికారులు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: ఒమిక్రాన్ భయాలు- దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన మహిళ కోసం వేట
ఇదీ చూడండి: దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా- 'ఒమిక్రాన్' అని అనుమానం!