దేశంలో గురువారం సాయంత్రం(6గంటల) వరకు మొత్తం 9,99,065 మంది లబ్ధిదారులకు కరోనా టీకా అందించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. మొత్తం 18,159 సెషన్లలో ఈ టీకా నిర్వహణ చేపట్టినట్టు ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి మనోహర్ అగ్నాని పేర్కొన్నారు.
టీకా పంపిణీ ప్రారంభమైన ఆరోరోజున(గురువారం).. 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తం 1,92,581 మంది వ్యాక్సిన్ వేయించుకున్నట్టు తెలిపారు.
ఇదీ చదవండి: టీకా లబ్ధిదారులతో శుక్రవారం మోదీ మాటామంతి