ETV Bharat / bharat

Viveka Murder Case: లాయర్‌ సలహా మేరకు సీబీఐ కోర్టులో లొంగిపోతా:ఎర్ర గంగిరెడ్డి - Erra Gnagi Reddy

Erra Gnagi Reddy
Erra Gnagi Reddy
author img

By

Published : May 4, 2023, 12:02 PM IST

Updated : May 4, 2023, 12:15 PM IST

11:53 May 04

మే 5లోపు ఎర్ర గంగిరెడ్డిని అరెస్టు చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశం

Erra Gangi Reddy: మాజీ మంత్రి వైఎస్​ వివేకా హత్య కేసులో A1గా ఉన్న ఎర్రగంగిరెడ్డిని ఈనెల 5లోపు లొంగిపోవాలని గత నెల 27న తెలంగాణ హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీబీఐ కోర్టులో ఎప్పుడు లొంగిపోవాలనే దానిపై లాయర్​తో చర్చిస్తున్నట్లు ఎర్ర గంగిరెడ్డి తెలిపారు. లాయర్​ సలహా మేరకు లొంగిపోతానని పేర్కొన్నారు.

Yerra Gangi Reddy Bail Cancelled: వివేకానంద రెడ్డి హత్య కేసులో A1గా ఉన్న ఎర్రగంగిరెడ్డి బెయిల్‌ రద్దు చేస్తూ ఏప్రిల్​ 27న తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రేపటిలోగా హైదరాబాద్ లోని.. సీబీఐ కోర్టులో లొంగిపోకపోతే అదుపులోకి తీసుకోవాలని.. సీబీఐని ఆదేశించింది. వివేకా హత్య కేసులో A1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి... కొంతకాలంగా బెయిల్​పై ఉన్నారు. 2019 మార్చి 28న అప్పటి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌.. ఎర్ర గంగిరెడ్డిని అరెస్ట్ చేసింది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక కొత్తగా ఏర్పాటు చేసిన సిట్.. సకాలంలో ఛార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో ఎర్ర గంగిరెడ్డికి 2019 జూన్ 27న పులివెందుల కోర్టు డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం వివేకా హత్య కేసు.. దర్యాప్తు వేగవంతం చేసిన సీబీఐ.. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసింది. సాక్షులను ప్రభావితం చేస్తున్నారని.. తెలిపింది. CBI వాదనలు పరిగణలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు.. గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

2021 అక్టోబర్ 26న పులివెందుల కోర్ట్‌లో మొదటి ఛార్జ్‌షీట్‌ వేసిన CBI.. ఎర్రగంగిరెడ్డిని మొదటి నిందితుడిగా చేర్చింది. 2019 ఫిబ్రవరి 10న.. సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దస్తగిరిని ఇంటికి పిలిపించిన ఎర్ర గంగిరెడ్డి.. వివేకా హత్య ప్రణాళిక గురించి చెప్పినట్లు CBI తెలిపింది. బెంగళూరు స్థలం..సెటిల్మెంట్ డబ్బులో వివేకా తనకు వాటా ఇవ్వలేదంటూ.. హత్యకు పురమాయించినట్లు పేర్కొంది. వివేకాను హత్య చేస్తే.. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి 40 కోట్ల రూపాయలు సుపారీ ఇస్తారని ఎర్రగంగిరెడ్డి నమ్మబలికారని వివరించింది. దీని వెనుక.. భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, మనోహర్ రెడ్డి ఉన్నట్లు ఎర్రగంగిరెడ్డే తనకు చెప్పారని కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి కూడా.. వాంగ్మూలం ఇచ్చారు.

ఇవీ చదవండి:

Last Updated : May 4, 2023, 12:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.