Tomato Robbery News In Cuttack Today : టమాటాల చోరీ కోసం కొత్త కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు కొందరు. ఒకరు టమాటాల ట్రక్కును అపహరిస్తే.. మరొకరు మార్కెట్ తరలించేందుకు సిద్ధమైన వాటిని దొంగతనం చేశారు. తాజాగా ఓ వ్యక్తి టమాటాల దొంగతనం కోసం ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. అదేంటో తెలుసుకుంటే షాక్‌కు గురికాక తప్పదు. ఇద్దరు మైనర్లను పని కోసం పిలిచి దుకాణం వద్ద తనఖా పెట్టి టమాటాలతో పరారయ్యాడు ఓ వ్యక్తి. ఈ ఘటన ఒడిశాలోని కటక్‌లో జరిగింది.
ఇదీ జరిగింది
టమాటాల దొంగతనం కోసం ఓ వ్యక్తి పక్కాగా ప్లాన్ చేశాడు. ఇందుకోసం ఇద్దరు పిల్లలను.. వాషింగ్ మెషీన్‌ను తరలించాలంటూ పనికి తీసుకెళ్లాడు. వీరికి ఒక్కరికి రూ.300 చొప్పున డబ్బులు ఇస్తానని నమ్మించాడు నిందితుడు. మార్గమధ్యలో ఛట్రా బజార్‌లోని ఓ కురగాయల దుకాణం వద్ద టమాటాలు కొందామని వారిని దించాడు. ఈ క్రమంలోనే 10 కిలోల కోసం బేరం ఆడిన నిందితుడు.. చివరకు 2 కిలోల టమాటాలను కొన్నాడు. ఆ తర్వాత డబ్బులను ఇంటి దగ్గర మర్చిపోయానంటూ దుకాణదారులకు చెప్పాడు. ఇంటికి వెళ్లి వెంటనే తీసుకొని వస్తానంటూ కట్టుకథ చెప్పాడు. వారిని నమ్మించేందుకు.. తాను ఇంటికి వెళ్లి డబ్బులు తీసుకొచ్చే వరకు ఇద్దరు మైనర్లను వారి వద్ద ఉంచుకోమన్నాడు. నిందితుడి మాటలు నమ్మిన దుకాణాదారుడు టమాటాలు ఇచ్చి అతడిని పంపించాడు.
దాదాపు రెండు గంటలు గడిచినా.. ఇంటికి వెళ్లిన మనిషి రాకపోయే సరికి అనుమానం వచ్చింది. దీంతో తనఖాగా ఉంచిన ఇద్దరు పిల్లలను ప్రశ్నించగా.. అసలు విషయం బయటకు వచ్చింది. తమకు అతడు ఎవరో తెలియదని.. కూలీకి తమను తీసుకొని వచ్చాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిని తాము మొదటిసారి చూశామని.. అతడిని తాము గుర్తించలేమని చెప్పారు. దీనిపై పోలీసులను సంప్రదించగా.. దుకాణాదారుడు తమకు ఫిర్యాదు చేయలేదని చెప్పారు.
టమాటాల ట్రక్కు హైజాక్
Tomato Vehicle Robbery : అంతకుముందు కర్ణాటకలో 2.5 టన్నుల టమాటాల వాహనాన్ని హైజాక్ చేశారు ముగ్గురు దుండగులు. టమాటాలను మార్కెట్‌కు తరలిస్తుండగా.. మధ్యలో వాహనాన్ని లాక్కుని తీసుకెళ్లారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవీ చదవండి : రూ.2.5లక్షలు విలువైన టమాటాలు చోరీ.. మహిళా రైతు కన్నీరు
'టమాటాలకు బౌన్సర్ల' ఘటనలో ట్విస్ట్.. వ్యాపారిపై కేసు నమోదు.. పరారీలో ఎస్పీ నేత