ETV Bharat / bharat

'ఆందోళనలను వీడండి.. చర్చలకు రండి' - కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తాజా వార్తలు

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడు నెలలుగా కొనసాగిస్తున్న ఉద్యమానికి ముగింపు పలికి, చర్చలకు రావాలని రైతు సంఘాలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్​ కోరారు. చట్టాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.

union agriculture minister
నరేంద్ర సింగ్​ తోమర్​
author img

By

Published : Jun 26, 2021, 7:54 PM IST

నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమానికి ఏడు నెలలు పూర్తయింది. ఈ నేపథ్యంలో.. ఆందోళనలకు ముగింపు పలికి.. చర్చలకు రావాలని రైతు సంఘాలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​ శనివారం కోరారు. చట్టాలపై మరోమారు చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ట్విట్టర్​ వేదికగా స్పష్టం చేశారు.

"రైతులు తమ ఉద్యమాన్ని ఆపేయాలని కోరుతున్నాను. దేశంలో చాలా మంది ఈ చట్టాలకు మద్దతు తెలుపుతున్నారు. ఈ చట్టాలలోని నిబంధనలపై ఇంకా రైతులకు ఏమైనా సందేహాలు ఉంటే.. వినడానికి, వారితో చర్చించడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది."

-నరేంద్ర సింగ్​ తోమర్​, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి

రైతు సంఘాలతో ఇప్పటివరకు 11సార్లు తాము చర్చలు జరిపామని నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు. కనీస మద్దతు ధరను ప్రభుత్వం పెంచిందని తెలిపారు.

గతేడాది నవబంర్​ 26 నంచి నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దులో రైతులు నిరసన చేపట్టారు. పంజాబ్​, హరియాణా, పశ్చిమ ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన వేలాది మంది రైతులు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు.

ఇప్పటివరకు ప్రభుత్వానికి, రైతులకు మధ్య 11 సార్లు చర్చలు జరిగాయి. జనవరి 26న రైతులు నిర్వహించిన ట్రాక్టర్​ ర్యాలీలో హింసాత్మక ఘటనల తర్వాత నుంచి మళ్లీ చర్చలు జరగలేదు.

ఇదీ చూడండి: రైతుల ఆందోళనల్లో ఉద్రిక్తత- జలఫిరంగుల ప్రయోగం!

ఇదీ చూడండి: రైతు ఆందోళనల్లో ఉగ్రదాడి.. దిల్లీలో హై అలర్ట్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.