ETV Bharat / bharat

శుక్రవారం రైతు సంఘాలు, కేంద్రం చర్చలు

author img

By

Published : Jan 14, 2021, 7:36 PM IST

సాగు చట్టాలపై ప్రతిష్టంభన నేపథ్యంలో కేంద్రం, రైతులకు మధ్య శుక్రవారం 9వ విడత చర్చలు జరగనున్నాయి. సమస్య పరిష్కారం కోసం సుప్రీంకోర్టు ఇటీవల కమిటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

tomar on farmer talks, agri minister
'రేపు చర్చలు యథాతథం'

కేంద్రం, రైతుల మధ్య తొమ్మిదో దఫా చర్చలపై సందిగ్ధం వీడింది. చట్టాలపై నలుగురు సభ్యులతో కూడిన బృందాన్ని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినప్పటికీ చర్చలు యథాతథంగా జరగనున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గురువారం స్పష్టం చేశారు. రైతులతో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు చర్చలు ప్రారంభమవుతాయని తెలిపారు.

చర్చలు అవసరం..

ఈ చర్చలపై భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్​ స్పందించారు. రైతు సంఘాలు చర్చలకు హాజరవుతాయని స్పష్టం చేశారు. సమస్య పరిష్కారం కావాలంటే చర్చలు జరగాల్సిందే అని అన్నారు.

"చూద్దాం శుక్రవారం ఏం జరుగుతుందో. ఏది ఏమైనా పరిష్కారం లభించే వరకు ప్రభుత్వంతో చర్చలు జరుగుతూనే ఉంటాయి."

-రాకేశ్​ టికాయత్, భారతీయ కిసాన్ యూనియన్ నేత

ప్రభుత్వంతో జరిగే చర్చలను తాము వ్యతిరేకించమని అన్నారు.

ఇదీ చదవండి : 'సుప్రీం' కమిటీ నుంచి తప్పుకున్న భూపేంద్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.