హరియాణాలోని ఫతేహాబాద్ జిల్లాలో రెండు వర్గాల మధ్య భీకర ఘర్షణ జరిగింది. ఒకరిపై మరొకరు రాళ్లు విసురుకున్నారు. జిల్లాలోని టోహానా పట్టణంలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
మొదట ఒక వర్గం వారు మరో వర్గం వాహనాలను కర్రలతో ధ్వంసం చేశారు. అనంతరం ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు రాళ్లను విసురుకున్నారని స్థానికులు తెలిపారు. ఈ ఘర్షణలో పలువురికి తీవ్రంగా గాయలయ్యాయి. పాత కక్షలే ఈ గొడవకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి సమాచారం కోసం దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి:కూలిన నాలుగంతస్తుల భవనం గోడ.. ఒకరు మృతి