నేటి రాశిఫలాల గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ చెప్పిన సంగతులు మీకోసం..
మేషం
కార్యసిద్ధి ఉంది. దైవబలంతో ఒక పనిని పూర్తిచేస్తారు. మొదలుపెట్టిన పనులను ఉత్సాహంగా పూర్తిచేస్తారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. లక్ష్మీ దేవిని సందర్శించడం మంచిది.
వృషభం
కాలం శుభప్రదంగా గడుస్తుంది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. చేపట్టిన పనులను పక్కా ప్రణాళికతో పూర్తి చేస్తారు. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. ఈశ్వరుడిని ఆరాధిస్తే మంచిది.
మిథునం
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. నూతన కార్యక్రమాలను కుటుంబ సభ్యుల అంగీకారం తర్వాతే మొదలు పెట్టండి. కుటుంబానికి సంబంధించిన ఒక శుభవార్త వింటారు. ఇష్టదేవతా ధ్యానం మంచి ఫలాలను ఇస్తుంది.
కర్కాటకం
శ్రమకు తగిన ఫలితాలుంటాయి. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. ధైర్యంతో తీసుకున్న నిర్ణయాలు గొప్ప ఫలితాన్నిస్తాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. శివారాధన శుభప్రదం.
సింహం
వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలున్నాయి. ఆర్థికంగా సానుకూలిస్తుంది. నూతన వస్తువులను కొంటారు. కొత్త పనులను ప్రారంభిస్తారు. శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళి పఠించడం మంచిది.
కన్య
మొదలు పెట్టిన పనిలో సంతృప్తికరమైన ఫలితాలు సాధిస్తారు. సమయానికి సహాయం చేసేవారున్నారు. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. లింగాష్టకం చదివితే మంచిది.
తుల
ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలను రచిస్తారు. ఈశ్వర సందర్శనం శుభప్రదం.
వృశ్చికం
సంకల్పసిద్ధి ఉంది. వ్యయం పెరగకుండా జాగ్రత్తపడాలి. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. అభివృద్ధిని ఇచ్చే అంశాల్లో స్పష్టత అవసరం. ప్రశాంతమైన వాతావరణం కలదు. ఆంజనేయ సందర్శనం ఉత్తమ ఫలితాలనిస్తుంది.
ధనుస్సు
చిత్తశుద్ధితో పనిచేసి మంచి ఫలితాలను అందుకుంటారు. ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. ఆర్థికంగా లాభపడతారు. బంధుమిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. శారీరక శ్రమ పెరుగుతుంది. శివ అష్టోత్తర శతనామావళి చదవడం మంచిది.
మకరం
మిశ్రమకాలం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. లక్ష్యాలను సాధించే క్రమంలో ఒత్తిడిని జయించాలి. ఇన్నాళ్లుగా మీకు అనుకూలంగా ఉన్నవాళ్లు వ్యతిరేకంగా మారే అవకాశముంది. క్షమా గుణంతో ఉండాలి. గణపతి సహస్రనామ పారాయణం మంచినిస్తుంది.
కుంభం
తోటివారి సహకారం ఉంటుంది. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. ఒక వ్యవహారంలో సమయానుకూలంగా స్పందించి అందరి ప్రసంశలు పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సూర్య ఆరాధనా శుభప్రదం.
మీనం
తలపెట్టిన పనిలో విజయం సిద్ధిస్తుంది. కొన్ని వ్యవహారంలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు పొందుతారు. ఎట్టిపరిస్థితిల్లోనూ.. నిర్లక్ష్యాన్ని దరిచేరనీయకండి. ఇష్టదైవాన్ని సందర్శిస్తే మంచిది.