దేశ రాజధాని దిల్లీలో కరోనా వ్యాప్తి కట్టడి కోసం.. వారాంతపు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేజ్రివాల్ ప్రకటించారు. దిల్లీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. దిల్లీలో బుధవారం 17, 282 కేసులు, 104 మరణాలు నమోదయ్యాయి.
ఈ నేపథ్యంలో దిల్లీ ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి లెఫ్టినెంట్ గవర్నర్‌తో.. కేజ్రివాల్ సమవేశమయ్యారు. కరోనా కట్టడి కోసం ఆంక్షలను అమలు చేయనున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్‌కు వివరించారు. అనంతరం.. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకూ వారాంతపు లాక్‌డౌన ప్రకటించారు.
లాక్‌డౌన్ సమయంలో మాల్స్, ఆడిటోరియంలను.. మూసివేయనున్నట్లు ప్రకటించారు కేజ్రీవాల్. పెళ్లిళ్లు వంటి శుభకార్యాలు చేసుకునేవారికి.. పాస్‌లు ఇస్తామని తెలిపారు. రెస్టారెంట్లలో తినడానికి వీల్లేదన్న దిల్లీ సీఎం.. పార్శిల్ తీసుకెళ్లేందుకే అనుమతిస్తామని పేర్కొన్నారు. సినిమా థియేటర్లు 30శాతం సామర్థ్యంతోనే.. నడపాలని స్పష్టంచేశారు. దిల్లీలోని ఆసుపత్రుల్లో పడకల కొరతలేదని.. కేజ్రివాల్ చెప్పారు. ప్రస్తుత డేటా ప్రకారం 5 వేల పడకలు ఖాళీగా ఉన్టన్లు చెప్పారు.