ETV Bharat / bharat

'అన్నాడీఎంకే.. మోదీకి బానిసగా మారింది' - ఏఎంఎంకే కూటమి

అన్నాడీఎంకే పార్టీ ప్రధాని నరేంద్ర మోదీకి బానిసగా మారిందన్నారు మజ్లిస్​ పార్టీ అధినేత అసదుద్దీన్​ ఓవైసీ. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. డీఎంకే-కాంగ్రెస్​ పొత్తుపైనా విమర్శలు గుప్పించారు. ఈ ఎన్నికల్లో ఏఎంఎంకే కూటమి విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు.

TN Polls: AIADMK no longer Jayalalithaa's party, turned into PM Modi's slave, says Asaduddin Owaisi
'అన్నాడీఎంకే ప్రధాని నరేంద్ర మోదీకి బానిసగా మారింది'
author img

By

Published : Mar 13, 2021, 1:15 PM IST

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నాడీఎంకేపై మండిపడ్డారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్​ ఓవైసీ. జయలలిత సారథ్యంలోని అన్నాడీఎంకే.. భాజపాకు దూరంగా ఉండేదని అయితే ప్రస్తుతం ఆ పార్టీ నరేంద్ర మోదీకి బానిసగా మారిందని ఆరోపించారు. చెన్నైలో నిర్వహించిన ప్రచార ర్యాలీలో ఈ మేరకు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధాన ప్రతిపక్షం డీఎంకేపైనా ఓవైసీ విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ కాంగ్రెస్​తో పొత్తు పెట్టుకోవడాన్ని ప్రశ్నించారు.

ఏఐఏడీఎంకే ఇక ఎంత మాత్రం మేడం జయలిలత పార్టీ కాదు. ఆమె తన పార్టీని భాజపాకు దూరంగా ఉంచేవారు. దురదృష్టవశాత్తు ఇప్పుడు ఆ పార్టీ ప్రధాని నరేంద్ర మోదీకి తొత్తుగా మారింది.

-అసదుద్దీన్​ ఓవైసీ, ఎంఐఎం అధినేత.

దినకరన్​తో నా పార్టీ పొత్తు పెట్టుకోవడాన్ని భాజపాకు 'బీ టీం' గా కాంగ్రెస్​ నాయకులు అభివర్ణిస్తున్నారని ఓవైసీ తెలిపారు. అయితే మహారాష్ట్రలో శివసేన అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ మద్దుతిచ్చిందని గుర్తుచేశారు. దీనికి పరోక్షంగా డీఎంకే సహకరించినట్లేనని.. లౌకికవాదం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు.

టీటీవీ దినకరన్​ స్థాపించిన ఏఎంఎంకే పార్టీతో ఎఐఎం పొత్తును సమర్థించుకున్న ఓవైసీ.. తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో తమ కూటమి విజయం సాధించిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ పొత్తులో భాగంగా.. మజ్లిస్​ పార్టీ మూడు చోట్ల తన అభ్యర్థులను నిలబెట్టింది.

ఇదీ చదవండి: కోవిల్​పట్టు నుంచి ఎన్నికల బరిలో దినకరన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.