ETV Bharat / bharat

నీట్‌ రద్దు చేయాలంటూ మోదీకి సీఎం లేఖ - నీట్‌ రద్దు చేయాలంటూ మోదీకి స్టాలిన్‌ లేఖ

దేశంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో నీట్‌ సహా అన్నిజాతీయ స్థాయి పరీక్షలు రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని తమిళనాడు సీఎం ఎం.కే స్టాలిన్‌ కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. మధురైలో నిర్మించతలపెట్టిన ఎయిమ్స్​ ను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

TN CM Stalin writes to PM Modi
మోదీకి స్టాలిన్‌ లేఖ
author img

By

Published : Jun 6, 2021, 5:30 AM IST

Updated : Jun 6, 2021, 6:36 AM IST

తమిళనాడులో కరోనా విజృంభణ నేపథ్యంలో 12వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. లోతైన సంప్రదింపుల అనంతరం విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్‌ వెల్లడించారు. మార్కులు కేటాయించే అంశంపై కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ స్కోర్‌ ఆధారంగానే ఉన్నత విద్యకు ప్రవేశాలు కల్పిస్తామని తెలిపారు.

కరోనా సెకండ్‌ వేవ్‌ కొనసాగుతుండటానికి తోడు థర్డ్‌ వేవ్‌ ముప్పు ఉందన్న హెచ్చరికల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యావేత్తలు, ఉపాధ్యాయులు, నిపుణులతో మూడు రోజులుగా జరిపిన సంప్రదింపుల అనంతరం ఈ ఏడాది ఇంటర్‌ బోర్డు పరీక్షలు రద్దు చేయాలని నిర్ణయించినట్టు స్టాలిన్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కమిటీ సిఫార్సుల ఆధారంగానే విద్యార్థులకు మార్కుల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు.

ఎయిమ్స్​ నిర్మాణానికి చర్యలేవి?

దేశంలో కరోనాతో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో నీట్‌ సహా అన్నిజాతీయ స్థాయి పరీక్షలు రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం స్టాలిన్‌ కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. మధురైలో నిర్మించతలపెట్టిన ఎయిమ్స్​ ను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

ఇదీ చదవండి : భాజపా నేత సువేందు అధికారిపై కేసు నమోదు

Last Updated : Jun 6, 2021, 6:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.