ETV Bharat / bharat

'నీట్ నుంచి మినహాయింపు'.. అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం - తమిళనాడు నీట్ పరీక్ష

దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్​పై కీలక బిల్లును తమిళనాడు అసెంబ్లీ ఆమోదించింది. నీట్ పరీక్ష నుంచి తమిళనాడును శాశ్వతంగా మినహాయించే బిల్లుకు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

NEET
నీట్ పరీక్ష
author img

By

Published : Sep 13, 2021, 6:24 PM IST

నీట్​ పరీక్ష పరిధి నుంచి తమిళనాడును శాశ్వతంగా మినహాయించే బిల్లును ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. 12వ తరగతి మార్కుల ఆధారంగా.. విద్యార్థులకు వైద్య విద్య కోర్సుల్లో అవకాశాలు కల్పించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం బిల్లులో పేర్కొంది.

సామాజిక న్యాయం కోసం..

సామాజిక న్యాయం చేకూరేలా, పేద, గ్రామీణ, నిమ్న వర్గాల విద్యార్థులకు అవకాశాలను మెరుగుపరిచేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని బిల్లులో ఉంది. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. భాజపా తప్ప.. అన్ని రాజకీయ పార్టీలు.. ఈ బిల్లుకు ఆమోదం తెలిపాయి. ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ.. భాజపా నాయకులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.

దివంగత ముఖ్యమంత్రి జయలలిత అధికారంలో ఉన్నప్పుడూ.. నీట్​ పరీక్ష నిర్వహించలేదని.. కానీ పళనిస్వామి సీఎంగా ఉన్న సమయంలోనే మొదటిసారి రాష్ట్రంలో ఈ పరీక్షను నిర్వహించారని సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. 2017లో ఈ బిల్లుకు ఏఐడీఎంకే మద్దతు ఇవ్వలేదన్నారు.

విద్యార్థి ఆత్మహత్య..

'నీట్​' పరీక్షపై ఉన్న భయంతో.. ఆదివారం పరీక్షకు కొన్ని గంటల ముందు చెన్నై సమీపంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థి(20) ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటికే రెండుసార్లు నీట్​ పరీక్ష రాసిన ఆ విద్యార్థి.. ఈసారి కూడా ఉత్తీర్ణత సాధించకపోతే.. ఎంబీబీఎస్​ చేయాలన్న తన కల కలగానే మిగిలిపోతుందనే మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇదీ చదవండి: విద్యార్థి మృతిపై రగడ- 'నీట్​' మినహాయింపు బిల్లుకు సీఎం హామీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.