జాతీయ స్థాయిలో పార్టీని విస్తరించే అంశంపై దృష్టి సారించిన తృణమూల్ కాంగ్రెస్.. తమ పార్టీ రాజ్యాంగంలో(విధివిధానాల్లో) మార్పులు చేయనున్నట్లు ప్రకటించింది. ఇతర రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది సభ్యులను చేర్చుకునేలా దీనిని సవరించనున్నట్లు తెలిపింది.
'జాతీయ స్థాయిలో భాజపాను ఎదుర్కొనేందుకు, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించేందుకు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ "అత్యంత బలమైన, అనుభవజ్ఞురాలైనన నేత' అని రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ వ్యాఖ్యానించారు.
ఇక.. కాంగ్రెస్ లేకుండానే ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేసేలా టీఎంసీ ముందడుగు వేసే అవకాశం ఉందని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.
"బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ జరిగిందో చూశాం. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనబ అదే జరుగుతుంది. మేము భాజపాకు వ్యతిరేకంగా జాతీయస్థాయిలో విపక్ష ఫ్రంట్ ఉండాలనుకుంటున్నాం. కాంగ్రెస్ మాతో చేరాలనుకుంటే, స్వాగతిస్తాం. కాంగ్రెస్ కోసం వేచి ఉండం. భాజపాకు వ్యతిరేకంగా పోరాడే ధైర్యం కాంగ్రెస్‌కు లేదు" అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ నేత తెలిపారు.
భాజపాను ఎదుర్కోవడంలో కాంగ్రెస్ విఫలమైందని ఈ మధ్యకాలంలో తృణమూల్ బహిరంగంగానే విమర్శిస్తోంది. గత వారం మేఘాలయలో కాంగ్రెస్ పార్టీకి (Meghalaya congress) ఝలకిస్తూ ఆ పార్టీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది తృణమూల్ కాంగ్రెస్లో(Meghalaya politics) చేరారు. ఈ చేరికతో రాత్రికి రాత్రే టీఎంసీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరించినట్లయింది. 2023లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
ఇవీ చదవండి: