'తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)ను వైరస్‌తో పోల్చారు బంగాల్ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు దిలీప్ ఘోష్. టీఎంసీ కరోనా కంటే ప్రమాదకరమైందన్న ఆయన.. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా వ్యాక్సిన్ వేసి నిర్మూలిస్తామన్నారు. దక్షిణ 24 పరగణ జిల్లాలో పర్యటిస్తున్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తమ పార్టీ అధికారంలోకి వస్తే భాజపా సహా ఇతర ప్రతిపక్షపార్టీల కార్యకర్తలపై బనాయించిన తప్పుడు కేసులను కొట్టివేస్తామన్నారు దిలీప్. కానీ, రాజకీయ ప్రత్యర్థులపై దారుణాలకు పాల్పడిన టీఎంసీ నేతలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
"టీఎంసీ లాంటి అప్రజాస్వామిక పార్టీని రాష్ట్రంలో ఇంతవరకు చూడలేదు. అధికార పార్టీ రోజులు లెక్కపెట్టుకుంటోంది. అయినప్పటికీ టీఎంసీ కార్యకర్తలు.. భాజపా కార్యకర్తలను భయపెడుతున్నారు" అని దిలీప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఇదీ చూడండి: టీఎంసీ- భాజపా నేతల ఘర్షణ.. పలువురికి గాయాలు