ETV Bharat / bharat

Tirumala Temple Will be Closed for 8 Hours Check Details: శ్రీవారి భక్తులకు బిగ్​ అలర్ట్​.. ఆరోజు ఆలయం మూసివేత.. వివరాలివే..!

Tirumala Temple Will be Closed for 8 Hours: శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. తిరుమల ఆలయాన్ని దాదాపు ఎనిమిది గంటల పాటు మూసివేయనున్నారు. ఎందుకు..? ఎప్పుడు..? లాంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Tirumala Temple Will be Closed for 8 Hours

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 3, 2023, 10:29 AM IST

Tirumala Temple Will be Closed for 8 Hours: శ్రీవారి భక్తులకు బిగ్​ అలర్ట్​. ఆ రోజున తిరుమల శ్రీవారి ఆలయాన్ని సుమారు 8 గంటల పాటు మూసివేయనున్నారు. ఆ వివరాలు మీ కోసం..

వరుస సెలవులతో తిరుమలలో రద్దీ బాగా పెరిగింది. ఇక, నవరాత్రి బ్రహ్మోత్సవాలు(Navaratri Brahmotsavam).. దసరా సెలవులతో ఈ నెల మొత్తం రద్దీ కొనసాగే అవకాశం ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అంచనా వేస్తోంది. దీంతో, ఈ నెలలో 1, 7, 8, 14 ఇంకా 15వ తేదీలలో ఎస్​ఎస్​డీ టోకెన్లు జారీ చేయకూడదని నిర్ణయించింది.

Partial Lunar Eclipse Date: అంతే కాకుండా.. అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున పాక్షిక చంద్రగ్రహణం(Partial Lunar Eclipse) కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం అక్టోబర్ 28 రాత్రే మూసివేస్తారు. అక్టోబర్ 29న తిరిగి తెరుస్తారు. అక్టోబర్ 29వ తేదీ తెల్లవారుజామున 1:05 నుంచి తెల్లవారుజామున 2:22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం పూర్తవుతుంది. కాబట్టి అక్టోబర్ 28న రాత్రి 7:05 గంటలకు ఆలయ తలుపులు(Tirumala Temple Closed) మూసివేయనున్నారు. గ్రహణ సమయానికి కొన్ని గంటల గంటల ముందుగా దేవాలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే..

TTD Auction of Clothes Donated by Devotees : శ్రీవారికి కానుకగా వచ్చిన వస్త్రాల వేలం.. ఏమున్నాయో తెలుసా?

గ్రహణం అనంతరం అక్టోబరు 29వ తేదీ తెల్లవారుజామున 3:15 గంటలకు ఏకాంతంలో శుద్ధి, సుప్రభాత సేవ నిర్వహించి తిరిగి ఆలయ తలుపులు తెరుస్తారు. ఆ తర్వాత దర్శనానికి భక్తుల్ని అనుమతిస్తారు. చంద్రగ్రహణం కారణంగా ఎనిమిది గంటల పాటు ఆలయ తలుపులు మూసి ఉంటాయి. ఈ కారణంగా సహస్ర దీపాలంకార సేవ, వికలాంగులు, వయోవృద్ధుల దర్శనం అక్టోబర్ 28న రద్దు చేశారు. అలాగే, పెరటాసి రద్దీ కారణంగా అక్టోబర్​ 2వ తేదీన ఎస్ఎస్‌డీ టోకెన్లను టీటీడీ రద్దు చేసింది.

అంతే కాకుండా అక్టోబర్​ నెలలో తిరుమలలో పలు విశేష ఉత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి. అక్టోబర్ 1న ఉండ్రాళ్ల తద్దె, అక్టోబర్ 3న మధ్యాష్టమి, అక్టోబర్ 10న మాతత్రయ ఏకాదశి, అక్టోబర్ 13న మాస శివరాత్రి, అక్టోబర్ 14న మహాలయ అమావాస్య అలాగే తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, వేదాంత దేశిక ఉత్సవం ప్రారంభం, అక్టోబర్ 15న తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం, అక్టోబర్ 19న నవరాత్రి బ్రహ్మోత్సవాలలో గరుడ సేవ, అక్టోబర్ 20న నవరాత్రి బ్రహ్మోత్సవాలలో పుష్పక విమానం, సరస్వతి పూజ, అక్టోబర్ 21న దేవి త్రిరాత్ర వ్రతం, సేనై ముదలియార్ వర్ష తిరు నక్షత్రం, అక్టోబర్ 22న నవరాత్రి బ్రహ్మోత్సవాలలో స్వర్ణ రథోత్సవాలు, దుర్గాష్టమి, అక్టోబర్ 23న నవరాత్రి బ్రహ్మోత్సవాలలో చక్ర స్నానం, మహర్నవమి, విజయ దశమి, వేదాంత దేశిక సత్తుమొర, పిళ్లై లోకాచార్య పోయిగై ఆళ్వార్ వర్ష తిరునక్షత్రం, అక్టోబర్ 24న పూద ఆళ్వార్ వర్ష తిరునక్షత్రం, అక్టోబర్ 25న మాతత్రయ ఏకాదశి, పెయ్యాళ్వార్ వర్ష తిరునక్షత్రం, అక్టోబర్ 31న చంద్రోదయోమ వ్రతం (అట్ల తద్దె) సేవలు జరగనున్నాయి.

TTD Angapradakshina Tickets Online : శ్రీవారి భక్తులకు శుభవార్త.. అంగప్రదక్షిణ టికెట్లు విడుదల

TTD Tirumala Seva Tickets for December : డిసెంబర్​లో తిరుమల వెళ్లే వారికి గుడ్​న్యూస్​.. శ్రీవారి సేవా టికెట్ల షెడ్యూల్ విడుదల.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.