ETV Bharat / bharat

డ్రైవింగ్‌ చేయాలంటే భయపడుతున్నారా? ఈ టిప్స్​తో దూసుకెళ్లండి!

Tips to Overcome Fear in Driving: డ్రైవింగ్ చేయాలంటే భయపడుతున్నారా? అయితే.. మీలో అమాక్సో ఫోబియా ఉంది. ఇది ఉన్నవాళ్లు స్టీరింగ్ పట్టుకోవాలంటే ముందుకురారు. వెనక సీట్లోకి వెళ్లిపోతుంటారు. కానీ.. మేము చెప్పే ఈ టిప్స్ పాటించడం ద్వారా.. డ్రైవింగ్​ సీట్లోకి వచ్చేస్తారు. రయ్య్​మంటూ దూసుకెళ్లిపోతారు..!

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 14, 2023, 11:59 AM IST

Tips to Overcome Fear in Driving: కొంత మందికి డ్రైవింగ్ చేయడం చాలా ఇష్టం. లాంగ్​ డ్రైవ్​లో జాయ్​ఫుల్​గా దూసుకెళ్తుంటారు. మరి కొంతమందికి మాత్రం భయం. చాలా మందిలో ఇదొక ఫోబియాగా మారిపోతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు భయపడటాన్ని.. అమాక్సోఫోబియా అంటారు. దీంతో.. అసలు డ్రైవింగ్ జోలికే వెళ్లరు. డ్రైవింగ్ భయం మహిళలకు మాత్రమే కాదు. పురుషులకు కూడా ఉంటుంది.

ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫోబియాతో చాలా మందే బాధపడుతున్నారట. అయితే.. ఇదేదో అసాధారణ సమస్య కాదని మానసిక నిపుణులు చెబుతున్నారు. మనిషికి ఎన్నో భావోద్వేగాలు ఉంటాయని, అందులో.. ఈ భయం అనేది ప్రాథమిక భావోద్వేగమని చెబుతున్నారు. అయితే.. డ్రైవింగ్​ సమయంలో మీరు భయపడుతుంటే గనక.. కొన్ని టిప్స్ ఫాలో అయితే సరిపోతుందని చెబుతున్నారు. తద్వారా.. మీ భయాన్ని మర్చిపోయి రైడ్​ను ఎంజాయ్​ చేయొచ్చని సూచిస్తున్నారు.

ప్రాక్టీస్‌ చేయాల్సిందే : "ప్రాక్టీస్​ మేక్స్​ ఏ మ్యాన్​ పర్ఫెక్ట్‌" అన్నది అందరికీ తెలిసిందే. నిరంతర సాధన చేస్తే.. సాధించలేనిది ఏదీ లేదనే విషయాన్ని మీరు తరచూ గుర్తు చేసుకుంటూ ఉండండి. ఇలా.. మీరు నిత్యం డ్రైవింగ్ ప్రాక్టీస్ చేస్తే.. మీ డ్రైవింగ్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. అప్పుడు ఆటోమేటిగ్గా.. మీపై మీకు నమ్మకం పెరుగుతుంది. ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగుతారు.

నెమ్మదిగా వెళ్లండి: డ్రైవింగ్ నేర్చుకోవడం అనేది ఒక ప్రక్రియ. ఇందులో మీరు నైపుణ్యం సాధించేత వరకూ.. నెమ్మదిగా డ్రైవ్ చేయండి. మీకు నమ్మకం వచ్చేంత వరకూ వేగం పెంచకండి. డ్రైవింగ్ చేసే ముందు వ్యాయామం చేయండి. దీనివల్ల డ్రైవింగ్ పట్ల మీకున్న భయాన్ని అధిగమించవచ్చు.

ఒంటరిగా నడపండి: డ్రైవింగ్ ఇన్​స్ట్రక్షన్స్ అన్నీ తెలిసిన తర్వాత.. మీరు ఒంటరిగా నడపడానికి ప్రయత్నించండి. దీనివల్ల.. మీరు డ్రైవింగ్‌పై పూర్తిస్తాయిలో దృష్టి పెట్టే ఛాన్స్ ఉంటుంది. ఇలా మీరు ఒంటరిగా డ్రైవ్ చేయడం ద్వారా.. రోజులు గడిచేకొద్దీ మరింత పర్ఫెక్షన్ సాధిస్తారు. అలా కాకుండా.. పక్కన వేరే వాళ్లు ఉంటే.. డ్రైవింగ్​ పై మీ కాన్సన్​ట్రేషన్​ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే మీరు ఒంటరిగా డ్రైవింగ్​ చేయాలి.

How to Check Driving Licence Status : డ్రైవింగ్​ లైసెన్స్​ దరఖాస్తు చేసుకున్నారా..? స్టేటస్ ఇలా తెలుసుకోండి!

ఆలోచన మార్చుకోండి: "నాకు డ్రైవింగ్ రాదు.. నేను డ్రైవింగ్ చేయలేను" అనే నెగెటివ్ థాట్​ను తక్షణమే మనసులోంచి తీసేయండి. సాధించాలనే కోరిక ఉంటే.. అందుకు తగిన విధంగా సాధన చేస్తే.. ఏదైనా సాధ్యమే అనే విషయాన్ని నమ్మండి. "లక్షలాది మంది డ్రైవ్ చేస్తుంటే.. నేనెందుకు చేయలేను?" అనే ఆలోచనా విధానం ద్వారా.. సెల్ఫ్ మోటివేట్ చేసుకోండి.

డ్రైవింగ్ లైసెన్స్ కోసం 960సార్లు టెస్ట్​కు హాజరు.. రూ.11 లక్షలు ఖర్చు.. చివరకు..

పార్కింగ్​ ప్రాక్టీస్ : రోడ్డుపై కారు నడపడం ఈజీగానే వచ్చేస్తుంది. కానీ.. పార్కింగ్ చేయడం.. పార్కింగ్​ నుంచి కారు బయటికి తీయడం అన్నది కాస్త కష్టమైనది. అందుకే.. కారు పార్కింగ్​ ను ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఇందులో పర్ఫెక్షన్ సాధిస్తే.. మీకు తెలియకుండానే మీలో కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. కాన్ఫిడెన్స్ పెరిగితే.. భయం ఆటోమేటిగ్గా పారిపోతుంది. సో.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి. మీలోని భయాన్ని తరిమికొట్టండి.

Free Driving Training: బండెక్కి వచ్చేత్తే... డుగ్గుడుగ్గు నేర్పిస్తాం

'టెస్లా' డ్రైవర్ రహిత కారు.. 60వేల వాహనాలపై టెస్టింగ్​ షురూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.