కశ్మీర్లో ఉగ్ర కార్యకలాపాలు మితిమీరిపోతున్నాయి. రాజౌరీ జిల్లాలో ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని సైన్యం ధ్వంసం చేసింది. బుధాల్ ప్రాంతంలోని ఖేట్ చాకా వద్ద సైన్యం, పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టగా పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందు గుండు సామగ్రి లభ్యమయ్యాయి.
ఏకే అసాల్ట్ రైఫిల్, 94 రౌండ్ల మ్యాగజైన్లు 3, రెండు పిస్టోళ్లు, ఐదు యూబీజీఎల్ గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నారు సిబ్బంది.
సహాయకుల అరెస్టు..
మరోవైపు.. బుడ్గాం జిల్లాలో పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది కలిసి ముగ్గురు ఉగ్ర అనుచరులను అరెస్టు చేశారు. వీరు లష్కరే తోయిబాతో పాటు తెహ్రీక్ ఉల్ ముజాహిదీన్ కోసం పనిచేస్తున్నట్లు తెలిసింది.
నిందితుల వద్ద నుంచి.. పెద్ద మొత్తంలో మందు గుండు సామగ్రి లభ్యమైంది. డిటోనేటర్లు, గ్రనేడ్లు, పిస్టోళ్లను స్వాధీనం చేసుకున్నారు.
వీరు బుడ్గాం, శ్రీనగర్లలో గ్రనేడ్ దాడులకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
ఇదీ చూడండి: 89లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు