ETV Bharat / bharat

'త్రీ ఇన్ వన్'​ చంద్రన్​.. ఒకేసారి 3 సంగీత పరికరాలతో స్వరాలు పలికించే మెజీషియన్

సంగీతంలో ఆయనదో ప్రత్యేకమైన స్టైల్. సోలోగా ఆర్కెస్ట్రా నడిపేయగల సమర్థుడు. చేతితో గిటార్ వాయిస్తూ, నోటితో మౌత్​ ఆర్గాన్​పై స్వరాలు పలికిస్తూ, కాళ్ల సాయంతో పియానో ప్లే చేస్తుంటే.. ఎవరైనా ఫిదా కావాల్సిందే.

three in one chandran
guitarist hippy chandran
author img

By

Published : Oct 20, 2022, 8:12 PM IST

ఒకేసారి మూడు సంగీత పరికరాలు వాయిస్తున్న చంద్రన్

Three In One Chandran : గిటార్, పియానో, మౌత్ ఆర్గాన్​.. ఇలా మూడు రకాల సంగీత పరికరాల నుంచి స్వరాలు వినిపిస్తున్నా.. వాటి వెనుక ఉన్న వ్యక్తి మాత్రం ఒక్కరే. ఆయనే 'త్రీ ఇన్​ వన్​ చంద్రన్' అలియాస్ హిప్పీ చంద్రన్. ఊరు.. కేరళ కోజికోడ్​. హార్మోనియం వాయించే సోదరుడ్ని చూసి చిన్నతనంలో సంగీతంపై మక్కువ పెంచుకున్నారు చంద్రన్. అప్పట్లో ప్రపంచాన్ని ఓ ఊపు ఊపిన హిప్పీ కల్చర్​కు ఆకర్షితులై.. తన స్టైల్​ మార్చుకున్నారు. అలా ఎరనీపళం వడకచ్చేరి చంద్రన్​ కాస్తా హిప్పీ చంద్రన్​గా మారారు.

"మా ఇంట్లో ఓ హార్మోనియం పెట్టె ఉండేది. దాన్ని మా అన్నయ్య వాయించేవారు. కొన్ని సార్లు నేను దాన్ని వాయించేటప్పుడు ఆయను చూసి నన్ను ప్రోత్సహించారు. ఏదైనా ఓ కొత్త పాట వాయించమని చెప్పేవారు. అలా నేనే సాధన చేయడం ప్రారంభించాను. అలా నా సంగీత ప్రస్థానం మొదలైంది."

- చంద్రన్​, సంగీత కళాకారుడు

క్రమంగా చంద్రన్ దృష్టి గిటార్ వైపు మళ్లింది. గిటార్ వాయించడమే కాక.. తయారు చేయడం ఎలానో ఓ విదేశీయుని వద్ద నేర్చుకున్నారు. "దానీ మోంగ్​ అనే వ్యక్తి గిటార్​ వాయించడమే కాకుండా వాటిని తయారు చేసేవాడు. ఓ రోజు నేను ఆయన్ను కలిసినప్పుడు నాకు ఈ విషయం చెప్పారు. తర్వాత నేను కూడా ఎంతో ఆసక్తిగా గిటార్ వాయించడం నేర్చుకున్నా. కానీ అది ప్లే చేస్తున్న సమయంలో చాలా నొప్పిగా ఉండేది. అలా 'కాంచీరే కాంచీరే' అనే హిందీ పాటకి కార్డ్స్​ నేర్చుకుని దాన్ని వాయించాను. తర్వాత లోహీ స్పోర్ట్స్​ అనే షాప్​లో ఓ సెకండ్​ హ్యాండ్​ గిటార్​ కొనుక్కుని సాధన చేయడం ప్రారంభించాను" అని చెప్పారు చంద్రన్.

ఆ తర్వాత కొజికోడ్​లోని కొన్ని స్టార్​ హోటళ్లలో రెగ్యులర్​గా షోలు చేసేవారు చంద్రన్. ఎన్నో మ్యూజికల్​ గ్రూప్స్​కు లీడ్​ గిటారిస్ట్​గానూ పనిచేశారు. ఓ సన్నిహితుడి సలహాతో జైపుర్​లోని ఓ సర్కస్​లో చేరారు చంద్రన్. గిటారిస్ట్​ అయినప్పటికీ బ్యాండ్​లోని మిగతా సభ్యులు లేనప్పుడు వారి వాయిద్యాలను కూడా చంద్రన్​నే వాయించేవారు.

ఆ సమయంలోనే ఆయనకు ఓ ఐడియా వచ్చింది. ఒకేసారి వేర్వేరు వాయిద్యాలను వాయిస్తే ఎలా ఉంటుందో చూడాలనుకున్నారు. మొదట గిటార్​తో పాటు మౌత్​ ఆర్గాన్​ను వాయించే సాధనాన్ని కనిపెట్టారు. ఆ తర్వాత దానికి కీబోర్డ్​ను కూడా జోడించారు చంద్రన్​. అలా మూడు వాయిద్యాలను అవలీలగా వాయిస్తూ హిప్పీ చంద్రన్ కాస్తా 'త్రీ ఇన్​ వన్​ చంద్రన్'​గా మారారు. అనేక రాష్ట్రాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. ఒకప్పుడు మలయాళం మాత్రమే వచ్చిన చంద్రన్​ ఇప్పుడు అనేక భాషలను అవలీలగా మాట్లాడుతున్నారు.

ఇదీ చదవండి: యువతకు మోదీ 'దీపావళి' గిఫ్ట్.. 75వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు

ఐదేళ్లలో సీఎం సంపద డబుల్.. కొత్తగా రూ.కోట్ల ఆస్తి.. బంగారం ఎంత ఉందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.