ETV Bharat / bharat

Threatening Letter to SCR : త్వరలో మరోఘోర రైలు ప్రమాదం.. ద.మ.రైల్వేకు బెదిరింపు లేఖ - రైలు ప్రమాదం హెచ్చరిక

Threatening Letter to SCR
Threatening Letter to SCR
author img

By

Published : Jul 3, 2023, 7:52 PM IST

Updated : Jul 3, 2023, 9:35 PM IST

19:47 July 03

ఆగంతకుడి నుంచి గత వారం అందిన హెచ్చరిక లేఖ

Latest news SCR : ఒడిశాలోని బాలాసోర్‌ రైలు ప్రమాదం తరహాలో హైదరాబాద్‌-దిల్లీ మార్గంలో రైళ్లు ఒకదాన్ని మరొకటి ఢీకొనెలా చేస్తామంటూ గత వారం దక్షిణ మధ్య రైల్వేకి బెదిరింపు లేఖ వచ్చింది. వెంటనే లేఖ వ్యవహారాన్ని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలంగాణ పోలీసులు దృష్టికి తీసుకెళ్లి విచారణ చేపట్టాల్సిందిగా కోరారు. రైల్వే అధికారులు మూడు రోజుల క్రితం తమకు లేఖ సంబంధించిన సమాచారాన్ని ఇచ్చారని ఉత్తర మండల డీసీపీ చందనా దీప్తి తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. రైల్వే అధికారుల నుంచి మరిన్ని వివరాలను సేకరిస్తున్నట్లు చెప్పారు. లేఖ ఎక్కడి నుంచి వచ్చిందనే అంశంపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు.

Odisa Train Accident : ఒడిశాలోని మరో రైలు ప్రమాదం బాలేశ్వర్‌ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదానికి.. తప్పుడు సిగ్నలింగే కారణమని ఉన్నతస్థాయి దర్యాప్తు బృందం తేల్చింది. వివిధ స్థాయిల్లో ఈ పొరపాట్లు చోటు చేసుకున్నట్లు రైల్వే సేఫ్టీ కమిషన్‌ నివేదిక స్పష్టం చేసింది. గతంలో ఇదే తరహాలో జరిగిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుని ఉంటే ఈ రైలు ప్రమాదం తప్పేదని అభిప్రాయపడింది. ఈ మేరకు రైల్వే బోర్డుకు దర్యాప్తు నివేదికను రైల్వే సేఫ్టీ కమిషన్‌ సమర్పించింది. తప్పుడు వైరింగ్‌, తప్పుడు కేబుల్‌ వల్ల 2022 మే 16న ఇదే తరహా దుర్ఘటన ఖరగ్‌పుర్‌ డివిజన్‌లోని బ్యాంక్రనాయబాజ్ స్టేషన్‌ వద్ద చోటు చేసుకుందని నివేదిక పేర్కొంది. అప్పుడే దాన్ని సరి చేసే చర్యలు తీసుకుని ఉంటే బహనగబజార్‌ వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగేది కాదని అభిప్రాయపడింది. సిగ్నలింగ్-సర్క్యూట్ మార్పులో లోపాలే ప్రమాదానికి కారణమని తేల్చింది. ఒడిశాలో జూన్​ 2న జరిగిన రైలు ప్రమాదంలో 292 మంది ప్రాణాలు కోల్పోగా, వెయ్యి మందికిపైగా గాయపడ్డారు.

ఒడిశా రైలు ప్రమాదం దర్యాప్తులో ట్విస్ట్.. జేఈ అమీర్​ ఖాన్​ ఇంటికి సీల్.. అంతా అక్కడే..

Odisha Train Tragedy 2023 : ఈ రైలు ప్రమాదం జరిగిన కొంత సమయంలోనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం ఎన్డీయే బృందాలు వచ్చి రైల్వే లైన్లులను ఏర్పాటు చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికుల మృతదేహాలను గుర్తించేందుకు స్థానిక ఆసుపత్రిలో ఉంచారు. ఇప్పటికి కొన్ని మృతదేహాలను గుర్తించలేదు. ఈ ప్రమాదం ఎందుకు జరిగింతో తెలుసుకునేందుకు కేంద్రం సీబీఐను రంగంలోకి దించింది. విచారణలో కీలక సమాచారాన్ని సీబీఐ అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. సిగ్నల్​ జేఈ అమీర్​ ఖాన్ ఇంటిని సీబీఐ అధికారులు సీల్​ వెయ్యడం ఆసక్తిని రేపింది. ఇప్పడు బెదిరింపు లేఖ రావడంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. ఒడిశా రైలు ప్రమాదం గురించి పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్​ చెయ్యండి.

ఇవీ చదవండి :

Last Updated : Jul 3, 2023, 9:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.