ETV Bharat / bharat

యాచకులకు దానంగా పాడైన ఆహారం.. తిరిగి వ్యాపారులకు విక్రయం! - శనీశ్వర మందిరంలో కలుషిత ఆహారం

Spoiled Food Supply in Temple: ఆ మందిరంలో యాచకులకు ఆహారం దానం చేయడం ఆనవాయితీ. అయితే, అక్కడ జరుగుతున్న దానంలో చాలా వరకు పాడైపోయిన ఆహారమే ఉంటోంది. యాచకులు స్వీకరించిన ఆహారం మళ్లీ వ్యాపారుల వద్దకు చేరుతోంది. అది మళ్లీ భక్తులకు విక్రయిస్తున్నారు వ్యాపారులు.

Spoiled Food Supply in Temple
Spoiled Food Supply in Temple
author img

By

Published : Dec 27, 2021, 9:49 AM IST

Thirunallar Saneeswaran Temple: ముందు భక్తులకు.. తర్వాత యాచకులకు... అనంతరం వ్యాపారులకు... అక్కడి నుంచి మళ్లీ భక్తులకు... ఇలా ఒకసారి విక్రయించిన ఆహారం మళ్లీమళ్లీ చక్రంలా తిరుగుతోంది. పుదుచ్చేరిలోని ప్రఖ్యాత తిరునల్లార్ శనీశ్వరన్ మందిరంలో ఈ తతంగం జరుగుతోంది. ఆహారం పూర్తిగా పాడైపోయినా.. దాన్నే మళ్లీ సరఫరా చేస్తున్నారు వ్యాపారులు. భక్తుల ఫిర్యాదుతో ఈ విషయంపై అధికారులు చర్యలు తీసుకున్నారు.

Spoiled Food Supply in Temple
శనీశ్వర ఆలయం
Spoiled Food Supply in Temple
వ్యాపారుల వద్ద అధికారుల తనిఖీలు

Spoiled Food Supply in Temple

తిరునల్లార్ శనీశ్వరన్ మందిరంలో యాచకులకు ఆహారం దానం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇక్కడి నలన్ నీటి కొలనులో స్నానమాచరించిన తర్వాత ఆహారాన్ని దానం చేస్తూ ఉంటారు. అందువల్ల అక్కడి వ్యాపారులు కొలను వద్దే ఆహార పొట్లాలను విక్రయిస్తుంటారు. అయితే, వీరు అమ్మే ఆహారం చాలా వరకు కలుషితమైందే ఉంటోందని అధికారులు గుర్తించారు.

Spoiled Food Supply in Temple
యాచకుల వద్ద ఉన్న ఆహారాన్ని పరిశీలిస్తున్న అధికారి
Spoiled Food Supply in Temple
ఆహార పొట్లాలను స్వాధీనం చేసుకుంటున్న అధికారులు

భక్తుల ఫిర్యాదు మేరకు తనిఖీలు చేపట్టారు. ఇక్కడ జరుగుతున్న తీరు చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ముందుగా కొలను వద్ద భక్తులకు వ్యాపారులు తమ వద్ద ఉన్న ఆహార పొట్లాలను విక్రయిస్తున్నారని, వాటిని భక్తులు యాచకులకు దానం చేస్తున్నారని వివరించారు. యాచకులు వాటిని తీసుకొచ్చి వ్యాపారులకు తిరిగి విక్రయిస్తున్నారని చెప్పారు. ఇక యాచకుల నుంచి తీసుకున్న ఆహార పొట్లాలను వ్యాపారులు మళ్లీ భక్తులకు అమ్మేస్తున్నారని తెలిపారు. ఇందులో కలుషిత ఆహారమే అధికంగా ఉంటోందని వెల్లడించారు.

Spoiled Food Supply in Temple
ఆహారం నుంచి దుర్వాసన

యాచకులు, వ్యాపారుల నుంచి ఈ ఆహారాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా వ్యాపారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: ట్యాబ్లెట్ల డోస్ పెంచి కన్నబిడ్డ 'హత్య'- శవాన్ని డ్రమ్ములో దాచి కిడ్నాప్ డ్రామా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.