జమ్ముకశ్మీర్ షోపియాన్లో భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఏటీఎంలో సోమవారం దాదాపు రూ.17లక్షలు అపహరించారు దుండగులు. అనంతరం ఏటీఎంను ధ్వంసం చేసినట్లు సమాచారం. రూ.17లక్షలు దోచుకెళ్లినట్లు ప్రాథమిక అంచనా. వాస్తవంగా ఎంత సొమ్ము లూటీ అయిందో దర్యాప్తులో తేలుతుందని పోలీసులు తెలిపారు.
కశ్మీర్లో మార్చిలో జరిగిన మూడో బ్యాంకు దొంగతనం ఇది. ఇప్పటికే బారాముల్లా, శ్రీనగర్లలో రెండు గ్రామీణ బ్యాంకులు లూటీకి గురయ్యాయి.
ఇదీ చూడండి: 'జమ్ముకశ్మీర్లో రాజకీయ హత్యలకు కుట్ర'