ETV Bharat / bharat

'వ్యాక్సిన్ పంపిణీ.. అందరికీ ఇప్పుడే వద్దు'

సామూహిక, విచక్షణారహిత, అసంపూర్ణ టీకా పంపిణీ మేలు చేయదా? అందరికీ టీకా వేయటం వల్ల మ్యుటేషన్స్‌ పెరిగి కొత్త వేరియంట్లు పుచ్చుకొచ్చే ప్రమాదం ఉందా? సామూహిక టీకా పంపిణీకి బదులు.. వైరస్‌ వల్ల ఎక్కువ హానీ కలిగేవారికి, తీవ్రమైన రోగాలు ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలా? అంటే నిపుణుల నుంచి అవుననే సమాధానం వస్తోంది. వ్యాక్సిన్‌ పంపిణీ, వైరస్‌ కట్టడికి ప్రధాని నరేంద్ర మోదీకి ప్రజారోగ్య నిపుణుల బృందం సమర్పించిన నివేదిక అంశాలపై ప్రత్యేక కథనం.

vaccination
'వ్యాక్సిన్ పంపిణీ.. అందరికీ ఇప్పుడే వద్దు'
author img

By

Published : Jun 12, 2021, 5:02 AM IST

కరోనా ముప్పు ఎక్కువగా ఉన్న వారికే తొలుత టీకాలు వేయాలని ప్రజా ఆరోగ్య నిపుణుల బృందం కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. అందరికీ వ్యాక్సిన్లు వేయడం ప్రస్తుత పరిస్థితుల్లో సముచితం కాదని పేర్కొంది. ప్రణాళికరహితంగా టీకా పంపిణీని నిర్వహిస్తే కొత్త రకం స్ట్రెయిన్లు పుట్టుకొచ్చే ప్రమాదముందని నిపుణుల బృందం హెచ్చరించింది. ఇప్పటికే కొవిడ్‌ బారినపడ్డవారికి వ్యాక్సిన్‌ వేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది.

ఇండియన్‌ పబ్లిక్‌ హెల్త్‌ అసోసియేషన్‌, ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌, సోషల్‌ మెడిసిన్‌, ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఎపిడమాలజిస్ట్స్‌, ఎయిమ్స్‌ వైద్యులు, కొవిడ్‌పై ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్‌ సభ్యులతో కూడిన బృందం ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి ఓ నివేదిక సమర్పించింది.

అలా అయితేనే మేలు..

అందరికీ టీకావేయడం కంటే, లక్షితవర్గాలకు ప్రాధాన్యక్రమంలో ఇవ్వటం వల్లనే మేలు జరుగుతుందని నిపుణుల బృందం తెలిపింది. యువత, చిన్నారులకు ఇప్పుడు టీకా పంపిణీ చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. సామూహికంగా, విచక్షణరహితంగా, అసంపూర్తిగా ఈ క్రతువు నిర్వహిస్తే వైరస్‌లో మ్యుటేషన్లు చోటుచేసుకొని కొత్త స్ట్రెయిన్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే కరోనా బారినపడ్డవారికి టీకాలు అందించడం అనవసరమని నిపుణులు స్పష్టం చేశారు. టీకా అనేది కరోనాపై శక్తిమంతమైన ఆయుధమని, దాన్ని వాడకుండా అట్టిపెట్టుకోకూడదని, అలాగని విచక్షణరహితంగా ఉపయోగించకూడదని కేంద్రానికి సూచించారు. స్వల్ప ఖర్చులో, అత్యధిక ప్రయోజనాలను రాబట్టుకునేలా టీకా పంపిణీని వ్యూహాత్మకంగా వాడుకోవాలని నిపుణులు పేర్కొన్నారు.

డెల్టావేరియంట్‌ విజృంభణతో కేసులు ఎక్కువ వస్తున్న ప్రాంతాల్లో కొవిషీల్డ్‌ డోసుల మధ్య వ్యవధిని తగ్గించడం వంటి అవకాశాలను పరిశీలించాలని నిపుణుల బృందం కోరింది. ప్రస్తుత పరిస్థితుల్లో మరణాలను తగ్గించడంపైనే ప్రధానంగా దృష్టి సారించాలని కేంద్రానికి సూచించింది. కొవిడ్‌తో మరణిస్తున్నవారిలో వృద్ధులు, ఊబకాయులు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఎక్కువగా ఉంటున్నట్లు నిపుణులు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో యువతకు టీకా వేయటం ఆర్థికంగా ప్రయోజనకరం కాదని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

'కొవిడ్​ టీకాతో ఎలాంటి ఇబ్బందుల్లేవ్​..'

టీకా తీసుకున్న వారిలో అయస్కాంత శక్తి- నిజమెంత?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.