కరోనా ఉద్ధృతితో వాయిదా పడిన జేఈఈ మెయిన్స్, నీట్(యూజీ) పరీక్షల షెడ్యూల్‌ను ఖరారు చేసేందుకు కేంద్ర విద్యాశాఖ త్వరలో సమావేశం కానుంది. తాజా పరిస్థితిని సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో జేఈఈ మెయిన్స్, నీట్ నిర్వహణపై కొంత స్పష్టత వచ్చినట్లయ్యింది.
విద్యార్థుల వెసులుబాటు కోసం జేఈఈ మెయిన్స్‌ను ఏడాదిలో నాలుగు సార్లు నిర్వహించే ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదటి దఫా ఫిబ్రవరిలో, రెండో దఫా మార్చిలో నిర్వహించగా ఏప్రిల్, మే నెలలో నిర్వహించాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్ కూడా నిలిచిపోయింది. మేలోనే నిర్వహించాల్సిన నీట్(యూజీ)పైనా ఇంకా అనిశ్చితి నెలకొంది.
ఇదీ చదవండి: