ETV Bharat / bharat

సివిల్స్​ అభ్యర్థుల పిటిషన్​ కొట్టివేత - 2020లో పరీక్ష

గతేడాది చివరి ప్రయత్నంగా సివిల్స్​ పరీక్షరాసి విఫలమైన అభ్యర్థులకు మరో అవకాశం ఇవ్వాలని దాఖలైన పిటిషన్​ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కరోనా కారణంగా గతేడాది జరిగిన సివిల్స్​ పరీక్షలకు సరిగా సన్నద్ధం కాలేదని పిటిషనర్లు వ్యాజ్యంలో పేర్కొన్నారు. 2021లో జరిగే పరీక్ష రాయడానికి అవకాశమివ్వాలని న్యాయస్థానాన్ని కోరారు.

Supreme court
ఆ సివిల్స్​ అభ్యర్థుల పిటిషన్​ కొట్టివేత
author img

By

Published : Feb 24, 2021, 12:32 PM IST

యూపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షకు అదనపు అవకాశం ఇవ్వాలన్న సివిల్స్​ ఆశావాహుల పిటిషన్​ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2020 సివిల్స్​లో చివరి ప్రయత్నంగా పరీక్షరాసి విఫలమైన వారికి మరో అవకాశం ఇవ్వాలని అభ్యర్థులు వ్యాజ్యంలో పేర్కొన్నారు.

కరోనా కారణంగా గతేడాది జరిగిన సివిల్స్​ పరీక్షలకు సరిగా సన్నద్ధం కాలేదని పిటిషనర్లు తెలిపారు. అందువల్ల తమకు ఈ సారి(2021) జరిగే ప్రిలిమ్స్​ పరీక్ష​ రాసేందుకు అవకాశమివ్వాలని కోరారు. దీనిని విచారించిన ధర్మాసనం ఈ నెల 9న తీర్పును రిజర్వు చేసింది. తాజాగా పిటిషన్​ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ ఖాన్ విల్కర్​తో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.

ఇదీ చూడండి: ఆ 'సివిల్స్'‌ అభ్యర్థులకు మరో అవకాశం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.