ఛత్తీస్‌గఢ్, బలోదబజార్ జిల్లాకు చెందిన అవిభక్త కవలలు(conjoined twins) శివరామ్, శివనాథ్.. సామాజిక మాధ్యమాలు వినియోగించే వారికి సుపరిచితమే. తమ శరీర ఆకృతి, చేసే పనులతో సామాజిక మాధ్యమాల వేదికగా లక్షల మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకున్న కవలలు శనివారం ప్రాణాలు కోల్పోయారు(conjoined twins die together). ఒకే శరీరంతో ఉన్నా.. ఎంతో చురుకుగా ఉండే వారు.. అకస్మాత్తుగా మృతి చెందటం పలు అనుమానాలకు తావిస్తోందని గ్రామస్థులు తెలిపారు
జిల్లాలోని ఖైందా గ్రామానికి చెందిన శివరామ్, శివనాథ్(conjoined twins) 2000 సంవత్సరంలో జన్మించారు. ఒకే శరీరం, రెండు కాళ్లు, రెండు తలలు, నాలుగు చేతులతో ఉన్న వారిని చూసేందుకు దేశంలోని చాలా ప్రాంతాల నుంచి గ్రామానికి వచ్చేవారు. అంతే కాదు.. తమ వీడియోలతో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్‌లో లక్షల మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకున్నారు. ఇటీవల వారు ఓ పెట్రోల్ పంపులో స్కూటీలో పెట్రోల్ పోస్తున్న వీడియో వైరల్‌గా మారింది.
అనుమానాస్పదం..
కవలల మృతిపై సమాచారం అందుకున్న పోలీసులు వారి ఇంటికి చేరుకుని కొన్ని గంటల పాటు పలు అంశాలపై ఆరా తీశారు. వారి మృతికి గల కారణాలను వెలికితీయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. అయితే.. ఇది సాధారణ మరణమా, మరే కారణమైనా ఉందా అనే విషయం తెలియలేదని పోలీసులు చెప్పారు. డాక్టర్ బీకే సోమ మృతదేహాలను పరిశీలించి సాధారణ మరణమేనని చెప్పారు. అయితే.. పోస్ట్‌మార్టం నిర్వహించి అసలు కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నించకపోవటం అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు.. వారి కుటుంబ సభ్యులు సైతం రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారని, ఆ కారణంగానే ప్రాణాలు కోల్పోయారని చెబుతున్నారు. అయితే.. అకస్మాత్తుగా మరణించటం అనుమానస్పదంగా కనిపిస్తోందని గ్రామస్థులు చెప్పారు.
కవలలు(conjoined twins) డ్రగ్స్‌కు అలవాటు పడినట్లు కొందరు చెప్పారు. మత్తు పదార్థాల కారణంగానే ప్రాణాలు కోల్పోయారా? అనే ప్రశ్నలు తలెత్తున్నాయని, అయితే.. పోస్ట్‌మార్టం చేయకపోవటం వల్ల అసలు కారణాలు తెలియదని తెలిపారు.
ఇదీ చూడండి: పెళ్లంటే భయం- కవలలు ఆత్మహత్య!