ETV Bharat / bharat

అదే చివరకు దేశ విభజనకూ దారి తీసింది! - జాతీయోద్యమం

1905లో హిందూ, ముస్లిం జనాభా ఆధారంగా బంగాల్​​ను రెండుగా విభజించింది బ్రిటిష్​ ప్రభుత్వం. అది మొదలు మత విభజనకు బీజం పడింది. దాదాపు ఆరేళ్ళపాటు అలుపెరగకుండా బెంగాలీలు విభజనపై పోరాడారు. దీంతో మళ్లీ బంగాల్​​ను కలిపేసింది. బ్రిటిష్‌ వారి విభజించు పాలించు సూత్రానికి అక్కడే బీజం పడింది. అది ఇంతింతై పెరుగుతూ... ముస్లిం లీగ్‌ ఏర్పాటుకు చివరకు దేశ విభజనకూ దారి తీసింది!

The partition of Bengal
బంగాల్​ విభజన
author img

By

Published : Aug 21, 2021, 9:32 AM IST

సిపాయిల తిరుగుబాటు (1857), కాంగ్రెస్‌ ఏర్పాటు (1885)... పెరుగుతున్న ఆందోళనలు... క్రమంగా జాతీయోద్యమం ఊపందుకుంటుండటం వల్ల బ్రిటిష్‌ ప్రభుత్వం తన కుటిల రాజకీయ తంత్రానికి తెరదీసింది. అదే విభజించు పాలించు సూత్రం! అప్పటిదాకా ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా కలసి కట్టుగా పోరాడుతున్న హిందూ-ముస్లింల మధ్య విభజన చిచ్చు పెట్టింది. 1905లో హిందూ, ముస్లిం జనాభా ఆధారంగా బంగాల్​ను రెండుగా విభజించింది. అది మొదలు మత విభజనకు బీజం పడింది!

అదే చివరకు దేశ విభజనకూ దారి తీసింది!

1765 నుంచి బంగాల్​, బిహార్‌, ఒడిస్సాలు కలసి ఒకే రాష్ట్రంగా ఉండేవి. 1905 నాటికే ఉమ్మడి బంగాల్​ జనాభా దాదాపు 8 కోట్లు! దీంతో... పరిపాలన సౌలభ్యం కోసమని సాకు చూపుతూ... అప్పటి వైస్రాయి లార్డ్‌ కర్జన్‌ బంగాల్​ను రెండుగా విభజిస్తున్నట్లు అక్టోబరు 16, 1905నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ముస్లింలు అధికంగా ఉన్న తూర్పు బంగాల్​ (ప్రస్తుత బంగ్లాదేశ్‌), మిగిలిన ప్రాంతాలతో పశ్చిమ బంగాల్​! భారత్‌లో అడుగుపెట్టిన తెల్లవారికి తూర్పు తీరమైన బంగాల్​ ప్రధాన కేంద్రంగా ఉండేది. విద్యాపరమైన సదుపాయాలు కూడా పెరిగాయి. దీనివల్ల బంగాల్​లో విద్యాధికులు అధికంగా ఉండేవారు. జాతీయోద్యమంలో కూడా వీరి పాత్ర ఎక్కువే! రాష్ట్రాన్ని విభజించటం ద్వారా ఆ విధంగా కూడా ఉద్యమాన్ని బలహీనపర్చినట్లవుతుందని బ్రిటిష్‌ ప్రభుత్వం భావించింది.

The partition of Bengal
.

కానీ... మతాలు వేరైనా, భాషాపరంగా బలమైన బంధంగల బెంగాలీలు దీనిపై తీవ్రస్థాయిలో ఉద్యమించారు. తూర్పు బంగాల్​లోని కొంతమంది తటస్థంగా ఉండిపోయినా... మెజార్టీ హిందూ-ముస్లింలు బంగాల్​విభజనను వ్యతిరేకించారు. బ్రిటన్‌ వస్తువులను నిషేధించారు. ప్రభుత్వ బడులు, కాలేజీలను బహిష్కరించారు. రవీంద్రుడు రచించిన అమర్‌ సోనార్‌ బంగ్లా పాట బంగాల్​ అంతటా ప్రతిధ్వనించింది. తెల్లవారి ఎత్తుగడను గుర్తించిన హిందూ-ముస్లింలు రాఖీలు కట్టుకొని మరీ...తమ ఐక్యతను చాటుతూ ఉద్యమంలో పాల్గొన్నారు. అదే క్రమంగా విదేశీవస్తు బహిష్కరణకు దారితీసి... తెల్లవారిపై ఆర్థిక ఒత్తిడిని పెంచింది. బ్రిటిష్‌ ప్రభుత్వం ఎంత దారుణంగా అణచివేయాలని చూసినా.. దాదాపు ఆరేళ్ళపాటు అలుపెరగకుండా బంగాలీలు విభజనపై పోరాడారు.

చివరకు... 1911లో వారి ఒత్తిడికి తలొగ్గిన బ్రిటిష్‌ ప్రభుత్వం... 1905నాటి బంగాల్​ విభజనను వెనక్కి తీసుకుంది. తూర్పు, పశ్చిమ బంగాల్​లను మళ్లీ కలిపేసింది. అస్సాం, బిహార్‌, ఒడిశాలను కొత్త రాష్ట్రాలుగా మార్చారు. బంగాలీలు కలసి కట్టుగా విభజనను అడ్డుకున్నా... బ్రిటిష్‌ వారి విభజించు పాలించు సూత్రానికి అక్కడే బీజం పడింది. అది ఇంతింతై పెరుగుతూ... ముస్లిం లీగ్‌ ఏర్పాటుకు... చివరకు దేశ విభజనకూ దారి తీసింది!

ఇదీ చూడండి: ఐదు వారాల్లో.. అడ్డంగా గీసేసి అడ్డదిడ్డ దేశ విభజన!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.