ఆగస్టు 1న జరగాల్సిన నీట్ ప్రవేశ పరీక్షను సెప్టెంబర్ 12న నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. జులై 13 సాయంత్రం 5 గంటల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందన్నారు. అర్హులైన విద్యార్థులు ఎన్టీఏ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
కొవిడ్ నిబంధనల మేరకు పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తునట్లు పేర్కొన్నారు ధర్మేంద్ర.