ETV Bharat / bharat

'టీకా విషయంలో చేతులు దులుపుకున్న కేంద్రం' - సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభం

కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వైఫల్యాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ సందర్భంగా కొవిడ్​పై ఆందోళన వ్యక్తం చేశారు సోనియా. వ్యాక్సినేషన్ ప్రక్రియలో మోదీ సర్కార్ ఘోరంగా విఫలమైందని ఆరోపించారు.

Sonia Gandhi
సోనియా గాంధీ
author img

By

Published : May 10, 2021, 12:10 PM IST

Updated : May 10, 2021, 1:21 PM IST

కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ(సీడబ్ల్యూసీ) సభ్యులు సమావేశమయ్యారు. ఇటీవల ముగిసిన.. నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వైఫల్యాలపై చర్చించడమే అజెండాగా సీడబ్ల్యూసీ సభ్యులతో భేటీ అయ్యారు సోనియా. తాజా ఓటమితో పాటు.. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలపైనా కాంగ్రెస్ ఈ సమావేశంలో దృష్టిసారించనున్నారు.

వచ్చే ఏడాది జరిగే ఎన్నికలపై దృష్టి..

2019 లోక్​సభ ఎన్నికల తర్వాత నుంచి హస్తం పార్టీ విఫలమవుతూనే ఉంది. నాటి సార్వత్రిక ఎన్నికల్లో.. అరుణాచల్​ప్రదేశ్​, ఆంధ్రప్రదేశ్​, ఒడిశా, హరియాణాలో ఘోర ఓటమి చవిచూసింది. గతేడాది జరిగిన దిల్లీ, బిహార్​ అసెంబ్లీ పోరులోనూ విజయం సాధించలేకపోయింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో.. తమిళనాడులో డీఎంకేతో పొత్తు పెట్టుకొని విజయం సాధించింది.

ఈ నేపథ్యంలో.. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలపైనా కాంగ్రెస్ ఈ భేటీలో దృష్టిసారించనుంది కాంగ్రెస్​. ఉత్తర్​ప్రదేశ్​, పంజాబ్, ఉత్తరాఖండ్​, గోవా, మణిపుర్​లో 2022లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ప్రదర్శన చేయడంపై సీడబ్ల్యూసీ సమావేశంలో సభ్యులు ప్రధానంగా చర్చించనున్నారు.

మూడోదశ కరోనాపై సోనియా ఆందోళన..

ఈ సందర్భంగా.. కరోనా 3.0 గురించి కాంగ్రెస్​ అధ్యక్షురాలి ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కట్టడిలో మోదీ సర్కారు ఘోరంగా విఫలమైందని సోనియా ఆరోపణలు చేశారు. టీకాలు వేసే బాధ్యత రాష్ట్రాలకు అప్పగించి, కేంద్రం చేతులు దులుపుకుందని ఆమె అన్నారు. అందరికీ ఉచితంగా వ్యాక్సిన్​ అందిస్తే ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ముప్పేమీ లేదని చెప్పారామె.

ఇదీ చదవండి: బంగాల్​లో మంత్రివర్గ విస్తరణ- 43మంది ప్రమాణం

Last Updated : May 10, 2021, 1:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.