ETV Bharat / bharat

అప్పుడు ఇంగ్లిష్​ ఫెయిల్​ స్టూడెంట్.. ఇప్పుడు పవర్​ఫుల్​ IPS​ ఆఫీసర్! - english fail student became ips officer

ఇంగ్లిష్​లో ఫెయిల్ అయిన విద్యార్థి ఐపీఎస్​ పాస్​ అయ్యారు. దృఢ సంకల్పంతో యూపీఎస్​సీ క్లియర్​ చేశారు. ఇటీవలే ఐపీఎస్​గా బాధ్యతలు చేపట్టారు. పరీక్షల్లో ఫెయిల్​ కావడం జీవితానికి ముగింపు కాదంటున్నారు మహారాష్ట్రకు చెందిన ఉమేశ్ గణపత్​. ఇదే ఆయన విజయ​ గాథ.

english fail ips officer
english fail ips officer
author img

By

Published : Apr 1, 2023, 1:44 PM IST

మానవ పరిణామ క్రమాన్ని ప్రతిపాదించిన సిద్ధాంతకర్త డార్విన్​ను​ ఒకప్పుడు సాధారణ విద్యార్థిగా పరిగణించారు. బల్బు కనిపెట్టి మానవ జీవితాల్లో వెలుగు నింపిన థామస్​ అల్వా ఎడిసన్​ను.. తెలివితక్కువ వాడన్నారు. కానీ.. వారు ఎవరూ చేరుకోలేనంత ఎత్తుకు ఎదిగారు. వైఫల్యం.. విజయానికి తొలి మెట్టు అనడానికి వీరి విజయ గాథలే చక్కటి ఉదాహరణలు. ఆ కోవలోకే వస్తారు మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి. ఇంగ్లిష్​లో ఫెయిల్​ అయినా.. దృఢ సంకల్పంతో ఐపీఎస్​ పాసయ్యారు. ఆయనే.. ప్రస్తుతం బంగాల్​లోని జల్పాయ్​గుడి జిల్లా పోలీసు సూపరింటెండెట్​గా సేవలు అందిస్తున్న.. ఉమేష్​ గణపత్ ఖండ్‌బహలే.

మహారాష్ట్రకు చెందిన ఉమేష్​ గణపత్​.. పదో తరగతి తర్వాత.. ఇంటర్​​లో జాయిన్​ అయ్యారు. అయితే, 2003లో ఇంటర్​ ఇంగ్లిష్​లో 21 మార్కులు తెచ్చుకుని ఫెయిల్​ అయ్యారు. అయినా నిరాశ చెందలేదు. చదువు ఆపేసి.. తన తండ్రితో వ్యవసాయం చేయాలనుకున్నారు. ఆ తర్వాత తన స్నేహితుల ప్రొత్సాహంతో మళ్లీ చదువుపై దృష్టి పెట్టారు. అలా మహారాష్ట్ర ఓపెన్​ యూనివర్సిటీలో ఇంగ్లిష్​ లిటరేచర్​లో డిగ్రీ పూర్తి చేశారు. దీంతో పాటు బీడీ, బీఎస్​సీ హార్టికల్చర్​ కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత ఇంగ్లిష్​లో మాస్టర్స్​ చేశారు. అలా చదువుతున్న సమయంలోనే మహారాష్ట్రలో ఎస్ఐ​ పరీక్ష రాశారు. అందులో మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించారు. ఆ ఉత్సాహంతోనే యూపీఎస్​సీ పరీక్ష రాశారు. అందులో 704వ ర్యాంక్​ సాధించి.. ఐపీఎస్​గా సెలెక్ట్​ అయ్యారు.

english fail ips officer
ఉమేశ్​ గణపత్​, జల్పాయ్​గుడి ఎస్పీ

"కొన్ని సార్లు చిన్న చిన్న ఓటముల వల్ల చాలా మంది నిరాశ చెందుతారు. అందుకే నేను కూడా రెండేళ్లు చదువు ఆపేశాను. పరీక్షలో ఫెయిల్ కావడం.. విద్యార్థుల జీవితానికి ముగింపు కాదు. అయితే, ఇలాంటివన్నీ ఓటములు కాదు. అవి మన జీవితంలో ఒక భాగం. అలా వినూత్నంగా ముందుకెళ్లాలి. ఇలా వెళ్లేటప్పుడు మనం ఓటమిపాలవుతాం. అయినా.. నిరాశ చెందకూడదు. వాటిని పట్టుదలతో అధిగమించవచ్చు. కాబట్టి ఎవరైనా ఆశను కోల్పోకూడదు. దృఢ సంకల్పంతో లక్ష్యాన్ని చేరుకోవాలి.
--ఉమేశ్​ గణపత్​, జల్పాయ్​గుడి ఎస్పీ

ఐపీఎస్​గా పోస్టింగ్​ వచ్చాక.. కూచ్‌బెహార్ జిల్లాలోని దిన్హటా ఎస్​డీపీఓ (సబ్​ డివిజనల్​ పోలీస్​ ఆఫీసర్)గా చేశారు ఉమేశ్​. 2020లో అలీపుర్‌దువార్ జిల్లాలో అదనపు పోలీసు సూపరింటెండెంట్‌గా పనిచేశారు. ఇటీవలే ఉమేశ్ గణపత్​ జల్పాయ్​గుడి పోలీసు సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. ఓటమి.. అన్నింటికీ ముగింపు కాదని.., బలమైన ఆలోచన, స్థిర లక్ష్యం ఉంటే మార్పు వస్తుందని.. దృఢ సంకల్పంతో లక్ష్యాన్ని చేరుకోవాలి ఉమేశ్ పిలుపునిచ్చారు.

ఇంగ్లీష్​ ఫెయిల్​ స్టుడెంట్.. IPS​ పాస్​.. చదువు మానేసి మరీ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.