ETV Bharat / bharat

సూరత్ ఘటనపై మోదీ విచారం- బాధితులకు పరిహారం

గుజరాత్​లోని సూరత్​లో జరిగిన ట్రక్కు ప్రమాదం విషాదకరమైనదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బాధితకుటుంబాలకు పరిహారాన్ని ప్రకటించారు.

author img

By

Published : Jan 19, 2021, 9:40 AM IST

modi, surat, accident
సూరత్ ఘటన విషాదకరం : ప్రధాని

గుజరాత్​లోని సూరత్​లో మంగళవారం జరిగిన ట్రక్కు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఇది విషాదకరమైన ఘటన అని పేర్కొన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

  • Ex-gratia of Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of those who have lost their lives due to the accident in Surat. Rs. 50,000 each would be given to those injured.

    — PMO India (@PMOIndia) January 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్​ఆర్​ఎఫ్​) నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. యాభై వేల చొప్పున పరిహారం ప్రకటించారు. సూరత్​లోని కోసంబ ప్రాంతంలో నిద్రిస్తున్న కూలీలపై లారీ దూసుకెళ్లిన ఘటనలో 15 మంది మృతిచెందారు.

గుజరాత్​ ముఖ్యమంత్రి విజయ్​ రూపానీ కూడా మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

ఇదీ చదవండి : రైతులతో 10వ దఫా చర్చలు వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.