Husband carrying wife dead body : అంత్యక్రియలకు డబ్బులు లేవని ఓ వ్యక్తి తన భార్య మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో పెట్టి తీసుకువెళ్లిన హృదయ విదారక ఘటన కర్ణాటకలోని యలందూరు పట్టణంలో జరిగింది.
మండ్య జిల్లాకు చెందిన రవి, అతడి భార్య కలమ్మ కొంతకాలంగా యలందూరు పట్టణంలోని అటవీశాఖ కార్యాలయం సమీపంలోని చిన్న గుడిసెలో నివసిస్తున్నారు. వీళ్లద్దరూ ప్లాస్టిక్ వస్తువులను సేకరిస్తూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం రాత్రి అనారోగ్యంతో కలమ్మ(26) మృతి చెందింది. ఆమెను కోల్పోయిన బాధలో ఉన్న భర్త రవికి.. అంత్యక్రియలకు డబ్బులు ఎలా సమకూర్చాలో తెలియలేదు. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుతూ మృతదేహాన్ని భుజాలపై వేసుకుని అంతిమ సంస్కారాల కోసం పట్టణంలోని సువర్ణవతి నది ఒడ్డుకు తీసుకువెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి వివరాలను తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.
గుండెనిండా దుఃఖం.. ప్లాస్టిక్ సంచిలో భార్య మృతదేహం.. అంత్యక్రియలకు డబ్బులు లేక నడుచుకుంటూ.. - డబ్బులులేక ప్లాస్టిక్ సంచిలో పెట్టిన భర్త
కర్ణాటకలోని యలందూరు పట్టణంలో ఓ హృదయ విదారక ఘటన జరిగింది. అంత్యక్రియలకు డబ్బులు లేవని ఓ వ్యక్తి తన భార్య మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో పెట్టి సమీప నదికి తీసుకువెళ్లాడు.