ETV Bharat / bharat

మెడికల్​ ఆక్సిజన్​ హోం డెలివరీ- ఎక్కడో తెలుసా?

ఆక్సిజన్​ సిలిండర్ల సరఫరాకు సంబంధించి దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి జిల్లాలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అవసరమైన వారికి ప్రభుత్వ సిబ్బంది ఆక్సిజన్​ సిలిండర్లను ఇంటికే తీసుకొచ్చి ఇస్తారని వెల్లడించింది.

oxygen
ఆక్సిజన్
author img

By

Published : May 15, 2021, 3:18 PM IST

Updated : May 15, 2021, 3:52 PM IST

కరోనా మహమ్మారిపై జరుపుతున్న పోరాటంలో భాగంగా.. శనివారం దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్సిజన్ కొరతను తట్టుకొని నిలిచేందుకు కేంద్ర పాలిత ప్రాంతంలోని ప్రతి జిల్లాలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న బాధితులు ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఇంటి వద్దకే డెలివరీ చేయించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.

'దిల్లీ వాసులకు ఈ రోజు నుంచి ఒక ముఖ్యమైన సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నాం. ప్రతి జిల్లాలో ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కో బ్యాంకులో 200 కాన్సంట్రేటర్లు ఉంటాయి. కొవిడ్ బాధితులకు అవసరమైనప్పుడు ఆక్సిజన్ లభించక ఐసీయూల్లో చేరాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. కొన్నిసార్లు మరణాలు సంభవిస్తున్నాయి. హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న బాధితులకు ఆక్సిజన్ అవసరమైతే..రెండు గంటల్లో మా బృందం వాటిని హోం డెలివరీ చేస్తుంది. ఆసుపత్రుల్లో కోలుకొని వచ్చినవారికి కూడా ఒక్కోసారి ఆక్సిజన్ కావాల్సిన పరిస్థితి వస్తోంది. వారు మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే వైద్యులు ఎప్పటికప్పుడు బాధితులను పర్యవేక్షిస్తారు. ఒకవేళ ఎవరైనా ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి వస్తే..తక్షణం స్పందిస్తాం' అని కేజ్రీవాల్ ఈ సందర్భంగా ప్రజలకు భరోసా ఇచ్చారు. సహాయం కోసం 1031 నంబర్‌కు కాల్ చేయాలని చెప్పారు.

కొద్ది వారాల క్రితం దిల్లీలో కొవిడ్ కేసులు పెరగడంతో..ఆసుపత్రులను ఆక్సిజన్ కొరత వేధించింది. ఆ అంశం సుప్రీం కోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడ కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు ఆప్‌ ప్రభుత్వం చెబుతోంది. దీనిపై కేజ్రీవాల్ మాట్లాడుతూ..'నిన్నటితో పోల్చుకుంటే కొత్త కేసులు మరింత తగ్గాయి. ప్రస్తుతం 6,500 మందికి పాజిటివ్‌గా తేలింది. పాజిటివిటీ రేటు 11 శాతానికి తగ్గింది. దిల్లీలో మరోసారి కరోనా విజృంభించదని ఆశిస్తున్నాం. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాం' అని అన్నారు. ఏప్రిల్‌ 19 నుంచి దిల్లీలో లాక్‌డౌన్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి.

ఇదీ చదవండి: ఆ రాష్ట్రాల్లో 67శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి

Last Updated : May 15, 2021, 3:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.