ETV Bharat / bharat

'ఫంగస్​లలో భిన్నమైన రంగులు అందుకే' - ఫంగసల రంగులు

దేశంలో బ్లాక్​, వైట్​ ఫంగస్​లు సహా కొత్తగా ఎల్లో ఫంగస్​ వెలుగు చూసిన క్రమంలో రంగుల్లో తేడాలపై క్లారిటీ ఇచ్చింది దిల్లీ ఎయిమ్స్​. వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి చెందితే ఫంగస్​ల రంగు భిన్నంగా కనిపిస్తుందని పేర్కొంది. దేశంలో కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయని తెలిపారు డాక్టర్​ రణ్​దీప్​ గులేరియా.

Dr. Randeep Guleria
డాక్టర్​ రణ్​దీప్​ గులేరియా
author img

By

Published : May 24, 2021, 5:05 PM IST

Updated : May 24, 2021, 5:32 PM IST

వేర్వేరు ప్రాంతాల్లో అభివృద్ధి చెందే ఫంగస్​ల రంగులు భిన్నంగా ఉంటాయన్నారు దిల్లీ ఎయిమ్స్​ డైరెక్టర్​ డాక్టర్​ రణ్​దీప్​ గులేరియా. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు మ్యూకోర్​మైకోసిస్​, క్యాడిడా, ఆస్పోరోజెనస్​ వ్యాధులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.

ఈ ఫంగస్​లు ప్రధానంగా సైనస్​, ముక్కు, కళ్ల చుట్టూ ఉండే ఎముకలలో కనిపిస్తాయని తెలిపారు గులేరియా. మెదడులోకి ప్రవేశించగలవని చెప్పారు. అరుదుగా ఊపిరితిత్తులు, జీర్ణాశయ పేగుల్లో కనిపిస్తాయని వెల్లడించారు.

మరోవైపు.. దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుతోందని వివరించారు.

"గత 17 రోజులుగా కొత్త కేసుల్లో స్థిరమైన తగ్గుదల కనిపిస్తోంది. గడిచిన 15 వారాల్లో దేశంలో కొవిడ్​ పరీక్షలు 2.6 రెట్లు పెరిగాయి. గత రెండు వారాలుగా పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గింది. ప్రస్తుత కొవిడ్​ సంక్షోభంలో పిల్లలు మానసిక ఒత్తిడి, స్మార్ట్​ఫోన్​ వ్యసనం, విద్యా సవాళ్లతో ఇబ్బందులు పడుతున్నారు. "

- డాక్టర్​ రణ్​దీప్​ గులేరియా, దిల్లీ ఎయిమ్స్​ డైరెక్టర్​

ఇదీ చూడండి: '18 ప్లస్​'కు టీకా కేంద్రాల్లోనూ రిజిస్ట్రేషన్​!

Last Updated : May 24, 2021, 5:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.