రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. తెలంగాణలో జరిగిన దిశ తరహా ఘటన కర్ణాటక.. కెంగేరీ పోలీస్ స్టేషన్లోని రామసంద్రలో జరిగింది. గుర్తు తెలియని మహిళ మృతదేహం పూర్తిగా కాలిపోయి నిర్మానుష్య ప్రదేశంలో ఆదివారం కనిపించింది. మృతురాలి వయసు 25 నుంచి 30 ఏళ్లు ఉండవచ్చని పోలీసులు తెలిపారు. మహిళపై అత్యాచారం చేసి.. అనంతరం హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు.
ఈ మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడం వల్ల ఈ దారుణం బయటపడింది. ఘటనా స్థలంలో మహిళ దుస్తులు లభ్యమయ్యాయి. పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఇవీ చదవండి: ప్రేయసితో కలిసి లాడ్జికి.. యువకుడు హఠాన్మరణం.. జేబులో 'శృంగార' మాత్రలు
'ఐదు రూపాయల డాక్టర్'.. పెద్దాసుపత్రిలో నయంకాని రోగాలూ మాయం!