ETV Bharat / bharat

అడవిలో అర్ధనగ్నంగా బాలిక మృతదేహం.. గ్యాంగ్​రేప్​ల కలకలం! - maharashtra crime news

Half Naked Girl Body: మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అటవీప్రాంతంలో అర్ధనగ్నంగా ఓ బాలిక మృతదేహం లభ్యమైన ఘటన మహారాష్ట్ర గోందియాలో జరిగింది. రాజస్థాన్​ అల్వార్​లో 16 ఏళ్ల బాలికపై గ్యాంగ్​రేప్​కు పాల్పడ్డారు నలుగురు దుండగులు. బంగాల్​లో రెండు చోట్ల గ్యాంగ్​రేప్​ ఘటనలు వెలుగుచూశాయి.

The body of a minor girl was found
The body of a minor girl was found
author img

By

Published : Apr 21, 2022, 7:23 PM IST

Half Naked Girl Body: మహారాష్ట్ర గోందియా జిల్లాలో షాకింగ్​ కేసు వెలుగుచూసింది. ఆమ్​గావ్​ తాలూకాలోని కుంభార్​ టోలా అటవీ ప్రాంతంలో అర్ధనగ్నంగా ఓ బాలిక మృతదేహం లభ్యమైంది. ఆమెను గుర్తుపట్టే వీలు లేకుండా ముఖాన్ని కాల్చారు దుండగులు. ముఖం సగానికిపైగా కాలిపోయింది. బాధితురాలి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

బుధవారం.. స్థానికులు కొందరు పూలు కోసేందుకు వెళ్లగా అటవీ ప్రాంతంలో రోడ్డు పక్కన బాలిక మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని ఆమ్​గావ్​ గ్రామీణ ఆస్పత్రికి తీసుకెళ్లి పంచనామా నిర్వహించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి వయసు 15-17 ఏళ్ల మధ్య ఉంటుందని అంచనా.

Minor Gang Raped: 16 ఏళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన రాజస్థాన్​ అల్వార్​లో వెలుగుచూసింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఓ మైనర్​ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. బాధితురాలి ఇంటి సమీపంలోనే మంగళవారం రాత్రి నిందితులు.. ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

Gang Rapes in Malda,Hooghly: బంగాల్​లో రెండు వేర్వేరు చోట్లు గ్యాంగ్​రేప్​ ఘటనలు కలకలం రేపాయి. హూగ్లీ ఉత్తర్​పారాలో తనపై తొలుత ఓ వ్యక్తి అత్యాచారం చేసినట్లు ఆరోపించింది ఓ యువతి. వీడియో తీసి బెదిరించి.. మరికొందరు పలుమార్లు సామూహిక అత్యాచారం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించి నలుగురు యువకులను అరెస్టు చేశారు పోలీసులు.

మాల్దా కాలియాచాక్​ ప్రాంతంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. 8వ తరగతి చదివే బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. బుధవారం రాత్రి బాలిక తల్లి ఇంట్లో లేని సమయంలో.. ఆమెను బయటకు తీసుకెళ్లిన నలుగురు వ్యక్తులు గ్యాంగ్​రేప్​కు పాల్పడినట్లు సమాచారం. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు ఇప్పటివరకు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మిగతావారి కోసం గాలిస్తున్నారు.

ఇవీ చూడండి: ప్రియుడితో బైక్​పై వెళ్తుందని.. మినీ ట్రక్కుతో ఢీకొట్టిన సోదరుడు

అసలే భార్యను కోల్పోయిన బాధ.. ఆపై మూకదాడి.. యువకుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.