ఇంటి మేడపై ఆడుకుంటుండగా రెండున్నరేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు కిందకు పడిపోయింది. 15 అడుగుల ఎత్తు నుంచి ఇరుకైన సందులో పడిపోయింది. రెండు గోడల మధ్య ఉన్న ఆరు అంగుళాల స్థలంలో చిన్నారి ఇరుక్కుపోయింది. ఒడిశా కటక్‌లోని (Cuttack Odisha news) చౌడ్‌వార్ ప్రాంతంలో శనివారం సాయంత్రం 4 గంటలకు ఈ ఘటన జరిగింది.
బాలిక అరుపులు విన్న ఆమె తల్లి.. వెంటనే కుటుంబ సభ్యులను అప్రమత్తం చేశారు. చుట్టుపక్కల వారు సైతం అక్కడికి చేరుకున్నారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
![the-baby-fell-from-15-foot-roof-in-cuttack](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13508290_vlcsnap-2021-10-31-10h01m26s053.jpg)
హుటాహుటిన వచ్చిన అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గోడలకు రంధ్రం చేసి బాలికను సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం చిన్నారిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యకరంగానే ఉందని సమాచారం.
![the-baby-fell-from-15-foot-roof-in-cuttack](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13508290_vlcsnap-2021-10-31-10h02m00s379.jpg)
ఇదీ చదవండి: సైకోప్రేమికుడిపై గ్రామస్థుల దాడి.. చివరకు