THDC Recruitment 2023 : మినీరత్న సంస్థ తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (టీహెచ్‌డీసీఐఎల్) 181 జూనియర్ ఇంజినీర్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు
- జూనియర్ ఇంజినీర్ ట్రైనీ (సివిల్) - 72 పోస్టులు
- జూనియర్ ఇంజినీర్ ట్రైనీ (ఎలక్ట్రికల్) - 72 పోస్టులు
- జూనియర్ ఇంజినీర్ ట్రైనీ (మెకానికల్) - 37 పోస్టులు
- బ్యాక్లాగ్ పోస్టులు, ప్రస్తుత ఖాళీలు మొత్తం కలిపి 181 పోస్టులు ఉన్నాయి.
విద్యార్హతలు
అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో మూడేళ్ల ఫుల్‌టైమ్ రెగ్యులర్ డిప్లొమా/ లేటరల్ ఎంట్రీ డిప్లొమా/ బిఎస్సీ/ బీఈ/ బీటెక్ చదవి ఉండాలి. 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్‌మెన్, డిపార్ట్మెంటల్ అభ్యర్థులు డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉంటే సరిపోతుంది.
వయస్సు
2023 జూన్ 7 నాటికి గరిష్ఠ వయస్సు 27 సంవత్సరాలు మాత్రమే ఉండాలి. అయితే రిజర్వేషన్ల వారీగా వయోపరిమితి సడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుము
అప్లికేషన్ ఫీజు రూ.600 ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ/ ఎక్స్ సర్వీస్‌మెన్/ డిపార్ట్మెంట్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు.
- నోట్ : ఆసక్తి గల అభ్యర్థులు కచ్చితంగా తమ పేరును ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్లో నమోదు చేసుకుని ఉండాలి. ఫుల్‌టైమ్ రెగ్యులర్ డిప్లొమా లేనివారు, కరస్పాండెన్స్ లేదా డిస్టన్స్ విధానంలో ఇంజినీరింగ్ డిప్లొమా చేసుకున్నవారు ఈ పరీక్షకు అనర్హులు.
ఎంపిక ప్రక్రియ
అర్హత పరీక్షను నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) సహకారంతో టీహెచ్‌డీసీఐఎల్ నిర్వహించనుంది. అభ్యర్థులు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష రాయాల్సి ఉంటుంది. ప్రశ్న పత్రం ఆంగ్లం, హిందీ భాషల్లో ఉంటుంది. పరీక్ష వ్యవధి 3 గంటలు.
200 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. ప్రశ్న పత్రంలో మొత్తం మూడు విభాగాలు ఉంటాయి. పార్ట్ 1లో ఎలక్ట్రిక్/ సివిల్/ మెకానికల్ సబ్జెక్టులకు సంబంధించిన 140 ప్రశ్నలు; పార్ట్ 2లో జనరల్ అవేర్‌నెస్‌కు సంబంధించి 30 ప్రశ్నలు; పార్ట్ 3లో రీజనింగ్‌కు సంబంధించిన 30 ప్రశ్నలు ఉంటాయి. అయితే ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులను ఇంటర్వ్యూ లేదా వైవాకు పిలుస్తారు. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి, అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- నోట్: మెడికల్ ఎగ్జామినేషన్ నిబంధనల్లో ప్రత్యేక వర్గాల వారికి ఎలాంటి సడలింపు ఉండదు.
శిక్షణ, జీతభత్యాలు
ఎంపికైన అభ్యర్థులకు ఒక ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. వీరికి జీతం, డీఏతో పాటు.. ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, గ్రాడ్యుటీ లాంటి ఇతర ప్రోత్సాహకాలు కూడా ఇస్తారు. లీవ్, మెడికల్ ట్రీట్మెంట్ సదుపాయం ఉంటుంది. ఉద్యోగం రెగ్యులర్ అయిన తరువాత కంపెనీ క్వార్టర్స్, హెచ్ఆర్ఏ, నెలవారీ ఖర్చుల రీయంబర్స్మెంట్, మొబైల్ సదుపాయాలు కూడా కల్పిస్తారు.
దరఖాస్తుకు చివరి తేదీ : ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైపోయింది. ఆసక్తి గల అభ్యర్థులు 2023 జూన్ 30లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.