ETV Bharat / bharat

కూలిన 4వ ఫ్లోర్​ స్లాబ్.. కింద అంతస్తుల్లోనూ విధ్వంసం.. నలుగురు మృతి

author img

By

Published : Sep 22, 2022, 4:16 PM IST

Updated : Sep 22, 2022, 4:27 PM IST

ఐదు అంతస్తుల భవనంలోని నాలుగో ఫ్లోర్ స్లాబ్​ కూలి నలుగురు మరణించారు. మహారాష్ట్ర ఠానే జిల్లా ఉల్హాస్​నగర్​లో జరిగిందీ దుర్ఘటన.

thane building collapse today
కూలిన 5 అంతస్తుల భవనం స్లాబ్

Thane building collapse today : మహారాష్ట్ర ఠానే జిల్లాలో భవనం స్లాబ్​ కూలిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఉల్హాస్​నగర్ పురపాలక సంస్థ సిబ్బంది, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్​డీఆర్​ఎఫ్​ సిబ్బంది కలిసి సహాయక చర్యలు చేపట్టారు.

thane building collapse today
కూలిన 5 అంతస్తుల భవనం స్లాబ్
thane building collapse today
సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది

ఉల్హాస్​నగర్​లోని క్యాంప్​ నంబర్​-5 ప్రాంతంలో మానస్ టవర్​ పేరిట ఓ ఐదంస్తుల భవనం ఉంది. 30 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవంతిలో 30 ఫ్లాట్లు ఉన్నాయి. భవనం ప్రమాదకర పరిస్థితిలో ఉందని, ఖాళీ చేయాలని అందులో నివసించే వారికి ఉల్హాస్​నగర్​ పురపాలక సంస్థ అధికారులు ఇప్పటికే రెండు సార్లు నోటీసులు ఇచ్చారు. అయితే.. ఇంకా ఐదు కుటుంబాలు ఆ భవనంలోనే నివసిస్తున్నాయి. ఇంతలోనే.. గురువారం ఉదయం 11.30 ప్రాంతంలో ఒక్కసారిగా నాలుగో అంతస్తు స్లాబ్ కూలింది. ఫలితంగా.. ఆ కింద అంతస్తుల స్లాబ్​లు కూడా కూలి.. గ్రౌండ్​ ఫ్లోర్​లో శిథిలాలు పడ్డాయి.

Last Updated : Sep 22, 2022, 4:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.