ETV Bharat / bharat

'పెళ్లి కాని అమ్మాయిలకు ఫోన్ ఇవ్వొద్దు'.. ఆ సమాజ్​ వింత రూల్స్​ - gujarat latest news

గుజరాత్​లో ఎంతో ప్రసిద్ధిగాంచిన ఠాకోర్ సమాజ్ వార్తల్లో నిలిచింది. పెళ్లికాని అమ్మాయిలు మొబైల్ ఫోన్లు ఇవ్వొంద్దంటూ ఓ వింత రూల్​ను తీసుకువచ్చింది. ఆ సంఘం రూపొందించిన 11 వింత రూల్స్ గురించి తెలుసుకుందాం.

Thakor society in Gujarat made 11 new rules for the society
గుజరాత్ ఠాకోర్ సమాజం కొత్త నిబంధనలు
author img

By

Published : Feb 21, 2023, 12:51 PM IST

పెళ్లికాని అమ్మాయిలు ఫోన్​ వినియోగించడానికి అనుమతి ఇవ్వంద్దంటూ వింత నిబంధన పెట్టారు ఓ సమాజ్​ సభ్యులు. దీనితో పాటు మరో 11 వింత నిబంధనలను రూపొందించారు గుజరాత్​లోని ఠాకోర్​ సమాజ్​ సభ్యులు. బనాస్​కాంఠ జిల్లాలోని భాభార్ తాలూకాలోని లున్‌సేలాలో జరిగిన సంత్‌ శ్రీ సదరమ్ బాపా విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా తమ సంఘంలో సంస్కరణలు తీసుకురావడానికి 11 నియమాలను ప్రవేశపెట్టారు ఠాకోర్ సమాజ్ సభ్యులు. తమ కమ్యూనిటీ ప్రజలు ఈ నిబంధనలకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం ఠాకోర్ సమాజ్ సభ్యులు.. ఈ 11 నియమాలను అందరూ పాటించాలని శపథం చేశారు.

ఠాకోర్ సమాజ్​ ప్రవేశపెట్టిన 11 నిబంధనలివే

  1. వివాహాలలో డీజేలపై పూర్తి నిషేధం.
  2. పెళ్లిలో బహుమతులకు బదులుగా నగదు ఇచ్చుకోవాలి.
  3. పెళ్లికి వరుడు, వధువు రోజువారీ జీవితంలో ఉపయోగించే వస్తువులను మాత్రమే బహుమతిగా ఇవ్వాలి.
  4. నిశ్చితార్థానికి 11 మంది అతిథులు మాత్రమే హాజరు అవ్వాలి.
  5. వివాహా కార్యక్రమానికి 51 మంది అతిథులు మాత్రమే హాజరు కావాలి.
  6. సామాజిక వర్గాల వారీగా కమ్యూనిటీ వివాహాలు నిర్వహించాలి.
  7. నూతన వధూవరులు.. బంధువుల ఇంటిని సందర్శించినప్పుడు వారికి డబ్బును ఇవ్వకూడదు.
  8. నిశ్చితార్థం, వివాహాన్ని రద్దు చేసినందుకు శిక్షలు విధించకూడదు.
  9. పెళ్లికాని అమ్మాయిలకు మొబైల్ ఫోన్​ను ఉపయోగించడానికి అనుమతి ఇవ్వకూడదు.
  10. మత్తు పదార్థాలకు బానిసలైన వారి కోసం డీ-అడిక్షన్ క్యాంపులు ఏర్పాటు చేయాలి.
  11. ప్రతి గ్రామంలోని ప్రజలు చదువుకోవడానికి వెళ్లే బాలికలకు రాకపోకలకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి.

గుజరాత్‌లోని వావ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే గనిబెన్ ఠాకోర్ ఆధ్వర్యంలో ఈ నిబంధనలను రూపొందించారు. అలాగే తక్కువ వ్యవధిలో ఠాకోర్ సొసైటీ రూ. 40 లక్షలకు పైగా వసూలు చేసిందని చెప్పారు. అయితే, ఠాకోర్ సమాజ్ సభ్యులు ఈ నిబంధనలను పాటిస్తారా లేదా అనేది చూడాలని చెప్పారు.

Thakor society in Gujarat made 11 new rules for the society
కార్యక్రమానికి హాజరైన ఠాకోర్ సమాజ్​ సభ్యులు

ఇవీ చదవండి:

భర్తను, అత్తను హత్య చేసిన భార్య.. ముక్కలుగా నరికి మూడు రోజులు ఫ్రిడ్జ్​లో.. తర్వాత మూటగట్టి..

రెండు భాగాలుగా మహిళ గర్భసంచి.. ప్రభుత్వాసుపత్రి వైద్యుల ఆపరేషన్​తో కవలలకు జన్మ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.