ETV Bharat / bharat

'2021లో భారత మార్కెట్లోకి టెస్లా'

అమెరికన్​ విద్యుత్​ కార్ల దిగ్గజం టెస్లా.. వచ్చే ఏడాది భారత్​లో కార్యకలాపాలను ప్రారంభించనుందని కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ పేర్కొన్నారు. ముడి ఇంధన ఉత్పత్తులను తగ్గించుకోవడం సహా గ్రీన్​ ఇంధనాన్ని, ఎలక్ట్రిక్​ వాహనాలను ప్రోత్సహించడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.

Tesla to enter India in 2021: Gadkari
2021లో భారత మార్కెట్లోకి ఎలక్ట్రిక్​ కారు..
author img

By

Published : Dec 29, 2020, 6:03 AM IST

అమెరికన్​ విద్యుత్​ కార్ల దిగ్గజం టెస్లా.. వచ్చే ఏడాది భారత్​లో కార్యకలాపాలను ప్రారంభించనుందని కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ తెలిపారు. డిమాండ్​ను బట్టి తయారీ యూనిట్​నూ నెలకొల్పనుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో.. దేశంలో దిగుమతి చేసుకుంటున్న రూ.8 లక్షల కోట్ల విలువైన ముడి ఇంధన ఉత్పత్తులను తగ్గించుకోవడం సహా గ్రీన్​ ఇంధనాన్ని, ఎలక్ట్రిక్​ వాహనాలను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.

"అమెరికా విద్యుత్​ కార్ల దిగ్గజం టెస్లా విక్రయ కేంద్రాలను భారత్​లో నెలకొల్పనుంది. డిమాండ్​ను బట్టి తయారీ యూనిట్లను స్థాపించనుంది. ఇది వచ్చే ఐదేళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుత్​ వాహనాల తయారీ కేంద్రం కానుంది," అని గడ్కరీ తెలిపారు.

వాతవరణ ఒప్పందంలో భాగంగా 2030 నాటికి కార్బన్​ ఉద్గారాలను 30-35 శాతానికి తగ్గించటానికి భారత్​ కట్టుబడి ఉంది. దీనిలో భాగంగా రూ.8 లక్షల కోట్ల ఇంధన ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకోనుంది. వీటితో పాటు ఆకుపచ్చ ఇంధనం, ఈవీ వాహనాల పెంపుపైనా భారత్​ దృష్టి సారించింది. 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ప్రైవేటు కార్లకు 30శాతం, వాణిజ్య కార్లకు 70శాతం, బస్సులకు 40శాతం, ద్విచక్ర వాహనాలకు 80శాతం చొప్పున ప్రోత్సాహకాలను అందించాలని కేంద్రం భావిస్తోంది.

- నితిన్​ గడ్కరీ, కేంద్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి.

ఇదీ చదవండి: 'బీఫ్​ తినొద్దని చెప్పడానికి మీరెవరు ?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.