కర్ణాటకలోని చిత్రదుర్గలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, వ్యాను ఢీకొన్న ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు గాయపడ్డారు. జిల్లాలోని మొలోకాల్మూరు తాలుకా, బీజీ కేరే గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై మోలకాల్మూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.